News July 20, 2024
ప్రిలిమ్స్ పాసైతే రూ.లక్ష.. అర్హతలు ఇవే

*అభ్యర్థులు జనరల్ (EWS)/బీసీ/ఎస్సీ/ఎస్టీలై ఉండాలి.
*తెలంగాణ రాష్ట్ర శాశ్వత నివాసి అయి ఉండాలి.
*యూపీఎస్సీ ప్రిలిమినరీలో పాస్ కావాలి.
*వార్షిక కుటుంబ ఆదాయం రూ.8 లక్షలలోపు మాత్రమే ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థల శాశ్వత ఉద్యోగులు అనర్హులు
*ఒకసారి మాత్రమే ఈ ప్రోత్సాహం అందుతుంది.
>> ఈ పథకానికి తెలంగాణ ప్రభుత్వం ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ అని పేరు పెట్టి ఆర్థిక సాయం అందించనుంది.
Similar News
News November 13, 2025
నేటి నుంచి సత్యసాయి శతజయంతి వేడుకలు

AP: నేడు పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఏటా NOV 18 నుంచి ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ కాగా శతజయంతి కావడంతో ఐదు రోజుల ముందు నుంచే నిర్వహిస్తున్నారు. ఇవాళ ప్రశాంతి నిలయంలో నారాయణ సేవను ట్రస్టీ ఆర్జే రత్నాకర్ ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో 19న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, 22న ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, 23న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్సవాల్లో పాల్గొంటారు.
News November 13, 2025
సాయిబాబాను ఎలా పూజించాలి?

సాయిబాబా పూజలో కఠిన నియమాలేం ఉండవు. ఉపవాసం చేసేవారు సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇతరులను దూషించకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. మద్యం, మాంసం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆయన పూజలో భక్తే ప్రధానం. భక్తి లేని ఘనమైన పూజ కంటే, భక్తితో సమర్పించే ఓ పువ్వు కూడా బాబాకు సంతోషాన్నిస్తుంది. బాబాకు మన మనసనే పుష్పాన్ని సమర్పించినా చాలు. ఆయన పేరు తలచి, దానధర్మాలు చేస్తే సాయినాధుని అనుగ్రహం భక్తులపై తప్పక ఉంటుందట. <<-se>>#Pooja<<>>
News November 13, 2025
ఆలు కుదురూ చేను కుదురూ ఆనందం

“ఆలు”అంటే భార్య. “కుదురు” అంటే స్థిరత్వం లేదా సవ్యంగా ఉండటం. భార్యతో కలహాలు లేకుండా కుటుంబ జీవితం సజావుగా, సంతోషంగా, స్థిరంగా ఉన్నప్పుడూ.. చేను కుదురూ అంటే పొలం(ఆదాయ వనరులు) బాగుండి, ఆదాయం స్థిరంగా ఉన్నప్పుడే రైతు జీవితంలో నిజమైన ఆనందం, ప్రశాంతత లభిస్తాయని ఈ సామెత చెబుతుంది.


