News August 28, 2024
దేశ వ్యతిరేక పోస్టులు పెడితే జీవితాంతం జైలే: యోగి సర్కార్
యూపీలోని యోగి సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే వారిని జీవితాంతం జైలులో ఉంచేలా కఠినమైన పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ పోస్టులకు ఈ రూల్ వర్తిస్తుంది. మరోవైపు ప్రభుత్వ పథకాలను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు నెలకు రూ.8 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందిస్తామని అక్కడి సర్కారు తెలిపింది.
Similar News
News September 14, 2024
పటిష్ఠంగానే ‘రాజధాని’ పునాదులు?
AP: ఐదేళ్లుగా నీటిలో నానుతున్న రాజధాని అమరావతిలోని భవనాల పునాదులు పటిష్ఠంగానే ఉన్నాయని చెన్నై, HYD IIT నిపుణులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు సమాచారం. తుప్పు పట్టిన ఇనుము తొలగించి, కెమికల్ ట్రీట్మెంట్ చేసి నిర్మాణాలు కొనసాగించవచ్చనే నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా నిపుణులు ఇటీవల రాజధాని నిర్మాణాలను పరిశీలించిన విషయం తెలిసిందే.
News September 14, 2024
రోహిత్ నాకు అన్నయ్యలాంటివాడు: సర్ఫరాజ్
బాలీవుడ్ సినిమా లగాన్‌లో ఆమిర్ ఖాన్ పాత్ర తరహాలో రోహిత్ శర్మ నిజజీవితంలో ఉంటారని క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ అన్నారు. జట్టులో అందర్నీ గౌరవంతో చూస్తారని పేర్కొన్నారు. ‘రోహిత్ చాలా విభిన్నమైన వ్యక్తి. మేం చాలా సౌకర్యంగా ఉండేలా చూసుకుంటారు. ఒకరకంగా చెప్పాలంటే నాకు అన్నయ్యలాంటి మనిషి. కొత్త కుర్రాళ్లను కూడా తనతో సమానంగానే ట్రీట్ చేస్తారు. ఆయన కెప్టెన్సీలో ఆడటాన్ని మేం ఎంజాయ్ చేస్తున్నాం’ అని తెలిపారు.
News September 14, 2024
‘టైమ్’ బెస్ట్ కంపెనీల జాబితాలో అదానీ గ్రూప్
2024లో ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థల జాబితాను టైమ్ సంస్థ తాజాగా విడుదల చేసింది. అదానీ గ్రూప్‌నకు చెందిన 8 సంస్థలకు అందులో చోటు దక్కింది. స్టాటిస్టాతో కలిసి 50 దేశాల్లో ఈ సర్వే నిర్వహించినట్లు టైమ్ పేర్కొంది. పని పరిస్థితులు, జీతం, సమానత్వం వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు వివరించింది. కాగా.. ఉద్యోగుల పట్ల తమ నిబద్ధత, వ్యాపార రంగంలో దక్షతకు ఇది నిదర్శనమని అదానీ గ్రూప్ ఓ ప్రకటనలో తెలిపింది.