News April 15, 2025
ఇలా పొదుపు చేస్తే.. ఆర్థిక సమస్యలకు చెక్!

ఉద్యోగమైనా, వ్యాపారం అయినా పొదుపు చేయకపోతే అనుకోకుండా వచ్చే ఆర్థిక సమస్యలను ఎదుర్కోలేం. అందుకే నెలనెలా వచ్చే ఆదాయంలో 20 శాతం కచ్చితంగా పొదుపునకు కేటాయించాలి. మిగతా 80 శాతం డబ్బునే ఇతరత్రా ఖర్చులకు వాడాలి. అందులోనూ అనవసరమైన ఖర్చులున్నాయా? అని ప్రతినెలా చెక్ చేస్తూ వాటిని తగ్గించుకోవాలి. హంగులు, ఆర్భాటాలు, కోరికలు తగ్గించుకుంటే భవిష్యత్తులో ఆర్థికపరమైన సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News December 9, 2025
కేజీ నిమ్మ రూ.6.. రైతుల గగ్గోలు

AP: రాష్ట్రంలో నిమ్మకాయ ధరలు భారీగా పడిపోవడంతో రైతులు కుదేలవుతున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు, పొదలకూరు, నంద్యాల జిల్లాలోని నిమ్మ మార్కెట్లలో 80 కేజీల బస్తా రకాన్ని బట్టి రూ.500 నుంచి రూ.1,000 మాత్రమే పలుకుతోంది. కిలోకు రూ.6-12 మాత్రమే వస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని అన్నదాతలు వాపోతున్నారు. గతేడాది ఇదే సమయంలో కేజీ రూ.40 వరకు పలికిందని చెబుతున్నారు.
News December 9, 2025
ఫీటల్ బ్రాడీకార్డియా గురించి తెలుసా?

ప్రెగ్నెన్సీలో పిండం కనీసం 7 మిల్లీమీటర్ల పొడవు ఉన్నప్పుడు డాక్టర్ సాధారణంగా బిడ్డ గుండె చప్పుడుని వినగలరని నిపుణులు చెబుతున్నారు. దీనిని గుర్తించలేకపోతే మరో వారంలో మరో స్కాన్ తీస్తారు. ఫీటల్ బ్రాడీకార్డియా ఉన్నప్పుడు గుండె కండరాలకి సిగ్నల్ ఆలస్యంగా ఉండడం, గుండె వ్యవస్థలో సమస్య, గుండె పై, కింది గదుల మధ్య సమస్య ఏర్పడతాయి. ఇలాంటప్పుడు తల్లి పరిస్థితిని బట్టి డాక్టర్స్ సరైన ట్రీట్మెంట్ని ఇస్తారు.
News December 9, 2025
సినిమా వాయిదా..! దర్శకుడి ఎమోషనల్ పోస్ట్

‘మోగ్లీ’ రిలీజ్ వాయిదా అంటూ ప్రచారం నడుమ డైరెక్టర్ సందీప్ రాజ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘అంతా సర్దుకుందనుకుంటున్న టైంలో మోగ్లీ చిత్ర విడుదలకు బ్యాడ్ లక్ ఎదురవుతోంది. డైరెక్టర్ సందీప్ రాజ్ అనే టైటిల్ను బిగ్ స్క్రీన్పై చూడాలనుకున్న కల రోజురోజుకూ కష్టమవుతోంది. వెండితెరకు నేను ఇష్టం లేదేమో. అంకితభావంతో పనిచేసిన రోషన్, సరోజ్, సాక్షి వంటి వారికోసమైనా అంతా మంచి జరగాలని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.


