News April 15, 2025
ఇలా పొదుపు చేస్తే.. ఆర్థిక సమస్యలకు చెక్!

ఉద్యోగమైనా, వ్యాపారం అయినా పొదుపు చేయకపోతే అనుకోకుండా వచ్చే ఆర్థిక సమస్యలను ఎదుర్కోలేం. అందుకే నెలనెలా వచ్చే ఆదాయంలో 20 శాతం కచ్చితంగా పొదుపునకు కేటాయించాలి. మిగతా 80 శాతం డబ్బునే ఇతరత్రా ఖర్చులకు వాడాలి. అందులోనూ అనవసరమైన ఖర్చులున్నాయా? అని ప్రతినెలా చెక్ చేస్తూ వాటిని తగ్గించుకోవాలి. హంగులు, ఆర్భాటాలు, కోరికలు తగ్గించుకుంటే భవిష్యత్తులో ఆర్థికపరమైన సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News April 18, 2025
వినూత్నంగా కేఎల్ రాహుల్ కూతురు పేరు

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, ఆయన సతీమణి అతియా శెట్టి ఇటీవల కూతురుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ రాహుల్ బర్త్‌డే సందర్భంగా అతియా ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. తమ పాపకు ‘ఇవారా విపులా రాహుల్’ అని పేరు పెట్టినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవారా అంటే అర్థం ‘దేవుడి బహుమతి’ అని పేర్కొన్నారు. పాప ‘నానీ’ గౌరవార్థం విపులా అని పెట్టినట్లు తెలిపారు.
News April 18, 2025
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) కీలక నిర్ణయం

రిక్రూట్‌మెంట్‌లో భద్రత, పారదర్శకత పెంపొందించేందుకు SSC కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది మే నుంచి నిర్వహించబోయే పరీక్షలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, పరీక్షా కేంద్రాల వద్ద ఈ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపింది. అయితే, అభ్యర్థి తమ వెరిఫికేషన్‌ను స్వచ్ఛందంగానే చేసుకోవాలని పేర్కొంది.
News April 18, 2025
ఉక్రెయిన్ ఆరోపణలు నిరాధారం: చైనా

రష్యాకు తాము ఆయుధాలు సరఫరా చేస్తున్నామని ఉక్రెయిన్ చేసిన ఆరోపణలు నిరాధారమని చైనా స్పష్టం చేసింది. ‘రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మా వైఖరి చాలా క్లియర్‌గా ఉంది. సీజ్‌ఫైర్ రావాలనే మేం కోరుకుంటున్నాం. యుద్ధాన్ని త్వరగా ముగించి శాంతి చర్చలు ప్రారంభించాలని ఇరు దేశాలకూ చెబుతున్నాం. అలాంటిది రష్యాకు మేం ఎందుకు ఆయుధాలు సరఫరా చేస్తాం? అవి అర్థంలేని ఆరోపణలు’ అని పేర్కొంది.