News September 21, 2024
లిఫ్ట్‌లకు నో చెప్పి రోజూ మెట్లు ఎక్కితే..
కాళ్లకు పనిచెప్పకుండా లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఉపయోగించడం పెరిగింది. అయితే రోజూ మెట్లు ఎక్కడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. తొడ కండరాలు, పొట్ట భాగంలోని కొవ్వు తగ్గుతుందని, చక్కటి శరీరాకృతి వస్తుందని పేర్కొంటున్నారు. వేగంగా కాకుండా నెమ్మదిగా స్టెప్స్ ఎక్కాలంటున్నారు. అయితే హార్ట్ ప్రాబ్లమ్స్, మోకాలు, మడమ, కీళ్ల నొప్పులు ఉన్నవారు మెట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
Similar News
News October 5, 2024
SC వర్గీకరణ రివ్యూ పిటిషన్లు కొట్టివేత
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అవకాశం కల్పిస్తూ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమీక్షించాలని దాఖలైన 32 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులో ఎలాంటి దోషాలు కనిపించడం లేదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు నిబంధనలు-2013లోని 47 రూల్ 1 కింద వీటిని సమీక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. గత నెల 24నే ఈ ఉత్తర్వులు వెలువడగా తాజాగా బహిర్గతమయ్యాయి.
News October 5, 2024
14 నుంచి ఏపీలో ‘పల్లె పండుగ’
AP: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ‘పల్లె పండుగ’ పేరుతో ఈ నెల 14 నుంచి 21 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇటీవల జరిగిన గ్రామసభల్లో ఆమోదం తీసుకున్న 19,500 రకాల పనులను దశలవారీగా పూర్తి చేయనుంది.
News October 5, 2024
బ్రహ్మోత్సవాలు: నేడు హంస వాహన సేవ
AP: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజైన ఇవాళ ఉదయం వేంకటేశ్వరస్వామి చిన్నశేష వాహనంపై ఊరేగనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 9 వరకు హంస వాహన సేవ ఉంటుంది.