News January 3, 2025
చైనా మాంజా అమ్మితే ఇలా ఫిర్యాదు చేయండి!
చైనా మాంజా ఎంతో డేంజర్ అని తెలిసినా విచ్చలవిడిగా అమ్ముతున్నారు. దీంతో ఇవి అమాయకుల పాలిట యమపాశాలుగా మారిపోతున్నాయి. గతంలోనూ ఓ జవాను కూడా ఈ మాంజా వల్ల చనిపోయారు. ఈక్రమంలో చైనా మాంజాను అమ్మినా, కొన్నా నేరమేనంటూ హైదరాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు. ఎవరైనా చైనా మాంజా అమ్మితే 9490616555 నంబర్‌కు వాట్సాప్‌లో ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. SHARE IT
Similar News
News January 26, 2025
వర్సిటీల్లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి: సీఎం
TG: రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు పదేళ్లు పాలించే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నట్లు CM రేవంత్ తెలిపారు. డా.అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో మాట్లాడుతూ వర్సిటీల పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. VCలుగా అన్ని సామాజిక వర్గాల వారు ఉండాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వర్సిటీల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని వీసీలను ఆదేశించారు. UGC ద్వారా వీసీల నియామకాలు చేపట్టాలని కేంద్రం కుట్ర చేస్తోందన్నారు.
News January 26, 2025
BREAKING: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం
TG: అన్ని రెగ్యులర్ కాలేజీల మాదిరే ఓపెన్ యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకూ ఇకపై ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని CM రేవంత్ ప్రకటించారు. HYDలోని డా.అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో సమావేశం సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఓపెన్ వర్సిటీలో ఫీజులు చాలా తక్కువే ఉంటాయని, ఇది ప్రభుత్వానికి పెద్ద భారమేమీ కాదన్నారు. ఆయా వివరాలను వెంటనే సేకరించాలని సీఎస్‌ను రేవంత్ ఆదేశించారు.
News January 26, 2025
రోజా.. ఐదేళ్లు రాష్ట్రానికి మీరేం చేశారు?: మంత్రి దుర్గేశ్
AP: Dy CM పవన్ కళ్యాణ్‌ను CM చంద్రబాబు దావోస్‌కు ఎందుకు తీసుకెళ్లలేదంటూ ప్రశ్నించిన మాజీ మంత్రి రోజాపై మంత్రి కందుల దుర్గేశ్ మండిపడ్డారు. క్యాబినెట్ మొత్తాన్ని ఎవరూ దావోస్ తీసుకెళ్లరని అన్నారు. ‘పవన్ గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదు. ఐదేళ్లు అధికారంలో ఉండి ఈ రాష్ట్రానికి ఆమె ఏం చేశారు? రిషికొండపై జగన్ భవనాలు కడుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? దాని వల్ల పర్యాటక శాఖ నష్టపోయింది’ అని విమర్శించారు.