News November 14, 2024
చిన్న పురుగే అనుకుంటే..!
సాలెపురుగు నన్నేమి చేస్తుంది అని ఎప్పుడైనా అనుకున్నారా? భూమిపై ఉన్న ఏ జీవినీ తక్కువ అంచనా వేయకూడదని సైంటిస్టులు హెచ్చరించారు. ఎందుకంటే సాలీడు జాతంతా తలుచుకుంటే ప్రపంచంలో ఉన్న 700 కోట్ల మందిని ఒక్కఏడాదిలో తినేస్తాయని సైన్స్ ఆఫ్ నేచర్ జర్నల్‌లో ప్రచురించారు. సాలీడులు ఏడాదికి సుమారు 400 మిలియన్ టన్నుల ఆహారాన్ని తీసుకుంటాయి. మొత్తం ప్రజల బయోమాస్ కేవలం 287 మిలియన్ టన్నులేనని అందులో రాసుకొచ్చారు.
Similar News
News December 11, 2024
‘రైతుభరోసా’ కోసం కోకాపేట భూముల తాకట్టు?
TG: రైతు భరోసా కోసం అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరినట్లు తెలుస్తోంది. రూ.10 వేల కోట్లు ఇచ్చేందుకు ICICI బ్యాంకు అంగీకరించినట్లు సమాచారం. కోకాపేట, రాయదుర్గంలోని TGIICకి చెందిన 400 ఎకరాల భూములను తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. ఆడిటింగ్ పూర్తి చేసి RBIకి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఇందులో రూ.8 వేల కోట్లు రైతుభరోసాకు, రూ.2 వేల కోట్లు పదవీ విరమణ ఉద్యోగుల ప్రయోజనాలకు ఖర్చు చేయనుంది.
News December 11, 2024
మోహన్‌బాబుపై కేసు నమోదు
TG: మీడియా ప్రతినిధులపై <<14843588>>దాడి<<>> చేసినందుకు నటుడు మోహన్‌బాబుపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఆయనపై 118 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఇప్పటికే నిన్న ఆయనకు నోటీసులు జారీ చేసిన రాచకొండ పోలీసులు ఇవాళ ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే నిన్న తీవ్ర ఘర్షణ తర్వాత మోహన్‌బాబు ఆసుపత్రిలో చేరారు.
News December 11, 2024
పసిఫిక్ ప్రాంతంలో చైనాను ఓడించగలం కానీ.: అమెరికా
చైనాను ఓడించడం తమకు సాధ్యమేనని అమెరికా ఇండో-పసిఫిక్ కమాండర్ అడ్మిరల్ శామ్యూల్ స్పష్టం చేశారు. కానీ సాంకేతికంగా డ్రాగన్‌పై తమకున్న పైచేయి క్రమంగా తగ్గుతూ వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘క్షిపణి టెక్నాలజీ, సమాచార వ్యవస్థలపై US ప్రధానంగా దృష్టి సారించాలి. సైబర్ దాడుల్ని తట్టుకునేలా ఆ సమాచార వ్యవస్థ ఉండాలి. క్షిపణులకు చాలా ఖర్చవుతోంది. పోరాటాల్లో వాటి బదులు డ్రోన్లను వాడాలి’ అని పేర్కొన్నారు.