News September 23, 2024

జనరల్‌ బోగీలో టికెట్ లేకుండా ప్రయాణిస్తే..?

image

రైళ్లలో జనరల్ బోగీల్లో టికెట్ ధర తక్కువే అయినప్పటికీ కొందరు నిర్లక్ష్యంతో టికెట్ లేకుండానే ప్రయాణిస్తుంటారు. అలాంటి వారు పట్టుబడితే రూ.250 వరకు జరిమానా ఉంటుంది. దాంతో పాటు అప్పటి వరకు ప్రయాణించిన దూరానికి ఛార్జీని కూడా చెల్లించాలి. చెల్లించకపోతే వారిని రైల్వే పోలీసులకు అప్పగించే హక్కు టీసీకి ఉంటుంది. ఇక ఈ తప్పును పదే పదే చేసేవారికి శిక్షల తీవ్రత కూడా అలాగే పెరుగుతుంటుంది.

Similar News

News September 23, 2024

మహిళలకు ఫ్రీ బస్సు.. మంత్రి కీలక ప్రకటన

image

AP: మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు. దీపావళి నుంచి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసేందుకు వారికి రూ.5-10 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. అటు అన్న క్యాంటీన్ల ద్వారా ఆకలి కేకలు లేకుండా పేదలకు మూడు పూటలా ఆహారం అందుతుందన్నారు.

News September 23, 2024

టికెట్ లేని ప్రయాణికులపై ఫోకస్

image

పండుగల సమయాల్లో టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించే వారిపై రైల్వేశాఖ ఫోకస్ పెట్టింది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువగా పోలీసులే ఉన్నట్లు గుర్తించిన రైల్వే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అలాంటి వారిపై రైల్వే యాక్ట్ 1989 ప్రకారం చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం వచ్చే నెల 1 నుంచి 15 వరకు, 25 నుంచి నవంబర్ 10 వరకు తనిఖీలు నిర్వహించనుంది.

News September 23, 2024

గోండి లిపి పండితుడు జంగు కన్నుమూత

image

TG: గోండిలిపి పండితుడు కోట్నాక్ జంగు(86) అనారోగ్యంతో మృతి చెందారు. ఆదిలాబాద్(D) నార్నూర్(మ) గుంజాల గ్రామంలో తుదిశ్వాస విడిచారు. పూర్వీకుల నుంచి గోండిలిపి నేర్చుకున్న ఆయన లిపికి సంబంధించిన ప్రతులు దాచారు. గోండు చిన్నారుల కోసం గోండి-తెలుగు వాచకాలను ప్రచురించి విద్యాబోధన చేశారు. 2014లో గుంజాలలో గోండిలిపి అధ్యయన కేంద్రం ఏర్పాటు చేయడంలో జంగు ప్రముఖుడు. ఆయన మృతిపై గోండు పెద్దలు సంతాపం వ్యక్తం చేశారు.