News September 23, 2024
జనరల్ బోగీలో టికెట్ లేకుండా ప్రయాణిస్తే..?
రైళ్లలో జనరల్ బోగీల్లో టికెట్ ధర తక్కువే అయినప్పటికీ కొందరు నిర్లక్ష్యంతో టికెట్ లేకుండానే ప్రయాణిస్తుంటారు. అలాంటి వారు పట్టుబడితే రూ.250 వరకు జరిమానా ఉంటుంది. దాంతో పాటు అప్పటి వరకు ప్రయాణించిన దూరానికి ఛార్జీని కూడా చెల్లించాలి. చెల్లించకపోతే వారిని రైల్వే పోలీసులకు అప్పగించే హక్కు టీసీకి ఉంటుంది. ఇక ఈ తప్పును పదే పదే చేసేవారికి శిక్షల తీవ్రత కూడా అలాగే పెరుగుతుంటుంది.
Similar News
News October 8, 2024
అందరి చూపు జమ్మూకశ్మీర్ పైనే..
దాదాపు పదేళ్ల తర్వాత ఎన్నికలు జరగడంతో దేశం మొత్తం చూపు జమ్మూకశ్మీర్ వైపే ఉంది. ఇవాళ ఫలితాల నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోనని అంతా ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ హంగ్ ఏర్పడవచ్చని చెప్పినా తమదే విజయమని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో హంగ్ ఏర్పడితే గవర్నర్ నామినేట్ చేసే ఐదుగురు ఎమ్మెల్యేలు కీలకం కానున్నారు. దీంతో బీజేపీకి లాభమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
News October 8, 2024
ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్
TG: కేంద్రం అందిస్తోన్న ‘నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్’కు ఇంటర్ పాసైన విద్యార్థులు ఈనెల 31 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. అలాగే గతంలో అప్లై చేసుకున్నవారు ఇదే గడువులోగా రెన్యువల్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ ఏడాది టాప్-20 పర్సంటైల్ వచ్చిన విద్యార్థులు 59,355 మంది ఉన్నారని తెలిపింది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ <
News October 8, 2024
నేడే రిజల్ట్స్: గెలుపెవరిదో?
హరియాణా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఇప్పటికే ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎగ్జిట్ పోల్స్ దాదాపు కాంగ్రెస్ కూటమికే అనుకూలంగా రాగా బీజేపీ మాత్రం గెలుపుపై ధీమాగా ఉంది. దీంతో ఫలితాలపై మరింత ఆసక్తి నెలకొంది.