News June 11, 2024

పవర్ ఎంజాయ్ చేద్దామనుకుంటే కుదరదు: పవన్

image

AP: పార్టీ MLAలకు జనసేనాని పవన్ కళ్యాణ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన 20మంది MLAలతో పవన్ భేటీ అయ్యారు. ‘పాతతరం రాజకీయాలకు కాలం చెల్లింది. అప్పటిలా కూర్చొని పవర్ ఎంజాయ్ చేద్దామనుకుంటే కుదరదు. ప్రజలు మనకు ఎంత మద్దతిచ్చారో వారికి కోపం వస్తే అంతే బలంగా నిలదీయగలరు. ఏదైనా సందర్భంలో వారు ఓ మాట అంటే భరించాలి. ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయవద్దు’ అని పవన్ సూచించారు.

Similar News

News March 17, 2025

కొత్త ఏడాది రాశిఫలాలు..

image

ఈ నెల 30న శ్రీవిశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త ఏడాది పంచాంగంలో రాశుల వారీగా ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు ఇలా ఉన్నాయి. కన్య, మిథునం రాశుల వారికి ఆదాయం ఎక్కువ. వీరికి 14 ఆదాయం, వ్యయం 2గా ఉంది. మేషం, వృశ్చికం రాశులవారికి 2మాత్రమే ఆదాయం ఉండగా, వ్యయం మాత్రం 14గా ఉంది. మేష రాశి వారికి అత్యధికంగా అవమానం 7గా ఉంది. కర్కాటకం, కుంభం రాశులవారికి రాజపూజ్యం 7గా ఉంది. మీరూ చెక్ చేసుకోండి.

News March 17, 2025

పోసాని సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి

image

AP: పోసాని కృష్ణమురళికి ఒక రోజు CID కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన్ను రేపు ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. ప్రెస్‌మీట్‌లో ప్రముఖులను అసభ్య పదజాలంతో దూషించినందుకు పోసానిపై CID కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఇదే కేసులో గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అటు మంగళవారం పోసాని బెయిల్ పిటిషన్‌ గుంటూరు కోర్టులో రేపు విచారణకు రానుంది.

News March 17, 2025

నియోజకవర్గానికి 4-5వేల మందికి సాయం: సీఎం రేవంత్

image

TG: ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని SC, ST, BC, మైనార్టీ నిరుద్యోగులకు అర్హత ప్రకారం అమలు చేస్తామని CM రేవంత్ తెలిపారు. ఒక్కొక్కరికి ₹50వేల నుంచి ₹4లక్షల వరకు మంజూరు చేస్తామన్నారు. ‘రాబోయే 2 నెలల్లో డబ్బులు మీ చేతుల్లో పెడతాం. జూన్ 2న 5లక్షల మంది లబ్ధిదారులను ప్రకటిస్తాం. నియోజకవర్గానికి 4-5వేల మందిని ఎంపిక చేస్తాం’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!