News December 1, 2024
తిరుమలలో రూం దొరకాలంటే..

AP: తిరుమలకు వెళ్తే గదులు దొరక్క చాలా మంది ఇబ్బంది పడతారు. తిరుమల కొండపై ఉన్న7,500 గదుల్లో 50% ఆన్‌లైన్‌లో ఉంటాయి. మిగతా 50% రూంలను తిరుమలలోని CRO ఆఫీసుకు వెళ్లి బుక్ చేసుకోవచ్చు. ఉ.5 గంటల నుంచి దర్శన టికెట్లు, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ తదితర వివరాలు ఇస్తే 1-4 గంటల్లో గది కేటాయిస్తారు. రూ.50, రూ.100, రూ.1000 గదులు ఉంటాయి. మ.12 గంటల తర్వాత వెళ్తే రూంలు దొరికే అవకాశం చాలా తక్కువ.
SHARE IT
Similar News
News February 7, 2025
గురుకులాల్లో ప్రవేశాలు.. ముగిసిన దరఖాస్తు గడువు

TG: ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు నిన్నటితో ముగిసింది. 643 గురుకులాల్లో మొత్తం 51,968 సీట్లు ఉండగా, 1.67లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఐదో తరగతికే 88,824 అప్లికేషన్లు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈనెల 23న ప్రవేశ పరీక్ష నిర్వహించనుండగా, మే 15 నాటికి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసి జూన్ 12 నుంచి క్లాసులు ప్రారంభిస్తామని తెలిపారు.
News February 7, 2025
ఈ నెల 14న రాష్ట్ర బంద్: మాల మహానాడు

TG: ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇందుకు నిరసనగా ఈ నెల 14న రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్లు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, మాల మహానాడు ప్రకటించాయి. మాలలను అణచివేసేందుకు ప్రధాని మోదీ, సీఎం రేవంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, MRPS నేత మందకృష్ణ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డాయి.
News February 7, 2025
విద్యుత్ డిమాండ్.. తెలంగాణ చరిత్రలోనే అత్యధికం

TG: రాష్ట్ర రోజువారీ విద్యుత్ డిమాండ్ విషయంలో సరికొత్త రికార్డు నమోదైంది. తెలంగాణ చరిత్రలోనే అత్యధికంగా గురువారం(FEB 6) 15,752 మెగావాట్లుగా నమోదైనట్లు ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్ తెలిపారు. 2024 మార్చి 8న రోజువారీ డిమాండ్ అత్యధికంగా 15,623 మెగావాట్లు నమోదుకాగా ఈసారి ఫిబ్రవరిలోనే అది బ్రేకయ్యింది. ఎండల నేపథ్యంలో రబీ సాగు, ఇళ్లు, పరిశ్రమల్లో కరెంటు వినియోగం పెరగడమే దీనికి కారణం.