News January 5, 2025
ఎక్కువ రోజులు బతకాలంటే..

*ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు తినాలి.
*ఒకేసారి ఎక్కువగా కాకుండా ఎక్కువసార్లు తిన్నా సరే కొంచెం కొంచెం తినాలి.
*పెరుగు/మజ్జిగ జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను తయారు చేస్తాయి.
*చికెన్, మటన్ బదులు చేపలు ఎక్కువగా తినాలి. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కంటిచూపు మెరుగవుతుంది.
*చక్కెర, ఉప్పు తగ్గించాలి. ఫలితంగా షుగర్, బీపీలకు దూరంగా ఉంటారు.
*రోజూ కనీసం 30 ని. పాటు వ్యాయామం చేయాలి.
Similar News
News April 13, 2026
చర్చలు విఫలం.. మార్కెట్లలో బ్లడ్‌బాతేనా?

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడం, క్రూడాయిల్ ధర పెరగడంతో భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలు చవిచూసే అవకాశం ఉంది. యుద్ధం ఇంకా కొనసాగనుండటంతో ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకాలకే మొగ్గు చూపనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జపాన్ నిక్కీ-225.. 0.80%, టోపిక్స్ 0.42% నష్టపోయాయి. సౌత్ కొరియా కోప్సి 1.83%, కొస్దాక్ 1.43%, హాంగ్‌కాంగ్ హాంగ్ సెంగ్, ఆస్ట్రేలియా S&P/ASX 200 మైనస్‌లో ట్రెండ్ అవుతున్నాయి.
News April 13, 2026
ఊసరవెల్లికే పోటీ.. 2 రోజుల్లో 3 పార్టీల నుంచి నామినేషన్

గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అరుదైన ఘటన జరిగింది. భరత్ సింగ్ వాఖ్లా అనే వ్యక్తి ఊసరవెల్లినే డామినేట్ చేస్తూ పార్టీల కండువాలను మార్చేశారు. దాహోద్(D) పైపెరో స్థానానికి రెండు రోజుల్లో 3 జాతీయ పార్టీల(BJP, INC, AAP) నుంచి నామినేషన్ వేశారు. ఎల్లుండితో విత్‌డ్రా గడువు ముగియనుండగా ఆయన అంతిమంగా ఏ పార్టీలో ఉంటారనేది ఆసక్తికరం. భరత్ 2017లో కాంగ్రెస్, 2022లో ఆప్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
News April 13, 2026
వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా ‘XChat’: మస్క్

వాట్సాప్ డేటా భద్రతపై <<19612326>>విమర్శలు<<>> వస్తున్న వేళ X అధినేత ఎలాన్ మస్క్ ‘XChat’ను ప్రకటించారు. ఏప్రిల్ 17న iOSలో లాంచ్ కానున్న ఈ యాప్‌కు ఫోన్ నంబర్ అవసరం లేదు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, స్క్రీన్‌షాట్ బ్లాకింగ్, సెల్ఫ్-డిస్ట్రక్ట్ మెసేజ్(వాటంతటవే మెసేజ్‌లు డిలీట్) వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఈ సూపర్ యాప్‌లో 481 మందితో గ్రూప్ చాట్స్, ఆడియో-వీడియో కాల్స్ చేసుకోవచ్చు. మీ X అకౌంట్‌తోనే దీనిని వాడవచ్చు.


