News November 30, 2024
మెంతికూరను ఎక్కువ రోజులు నిల్వ చేయాలంటే..
విటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా లభించే మెంతికూరను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవడం తేలికే. ఆకుల్ని ఏరి 3-4 టైమ్స్ బాగా కడిగి క్లాత్‌లో ఆరబెట్టుకోవాలి. తర్వాత గాలి చొరబడని కంటెయినర్లో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. క్లీన్‌చేసిన ఆకుల్ని కత్తిరించి జిప్‌లాక్ బ్యాగులో వేసి డీప్ ఫ్రిజ్‌లో పెట్టడం మరోపద్ధతి. మెంతిని కడగకుండా కాడలతో పేపర్లో చుట్టి 13 రోజులు స్టోర్ చేయొచ్చు.
Similar News
News December 4, 2024
సూర్యవంశీ విధ్వంసం.. సెమీస్ చేరిన భారత్
అండర్-19 ఆసియాకప్‌లో భారత జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. యూఏఈతో జరిగిన మ్యాచులో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన UAE 137 పరుగులకు ఆలౌటైంది. చేధనలో ఓపెనర్లు ఆయుశ్(67), వైభవ్ సూర్యవంశీ(76) రెచ్చిపోవడంతో 16.1 ఓవర్లలోనే విజయం సొంతమైంది. కాగా 13 ఏళ్ల సూర్యవంశీ IPLలో రూ.కోటికి పైగా ధర పలికిన సంగతి తెలిసిందే.
News December 4, 2024
మెగా హీరోకు అల్లు అర్జున్ థాంక్స్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే
మరి కొన్ని గంటల్లో ‘పుష్ప-2’ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్‌తో సహా చిత్ర బృందానికి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ <<14786860>>విష్<<>> చేశారు. దీనికి అల్లు అర్జున్ బదులిస్తూ ధన్యవాదాలు తెలిపారు. మీరంతా సినిమాను ఇష్టపడతారని ఆకాంక్షిస్తున్నట్లు రాసుకొచ్చారు. అయితే అక్కడ ‘మీరంతా’ అని ఎవరిని ఉద్దేశించి అన్నారని ఐకాన్ స్టార్‌ను మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
News December 4, 2024
PHOTO: ఒక్కటైన నాగచైతన్య-శోభిత
అక్కినేని నాగచైతన్య-శోభిత దూళిపాళ వివాహం ఆడంబరంగా జరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో ANR విగ్రహం ముందు ఈ జంట ఒక్కటయ్యారు. పెళ్లి వేడుకల్లో వధూవరుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా ఈ జంట రేపు లేదా ఎల్లుండి శ్రీశైలం/తిరుమలకు వెళ్లనున్నారు.