News May 26, 2024
టీ20 వరల్డ్ కప్ గెలిచాకే కేక్ తింటా: రోహిత్ శర్మ
భారత కెప్టెన్ రోహిత్ శర్మ సహా పలువురు ప్లేయర్స్ టీ20 వరల్డ్ కప్ కోసం తాజాగా అమెరికాకు చేరుకున్న సంగతి తెలిసిందే. బయలుదేరే ముందు వారు కేక్ కటింగ్ వేడుక చేసుకున్నారు. కేక్ తినిపించేందుకు పంత్ యత్నించగా రోహిత్ నిరాకరించారు. గెలిచాకే తింటానని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. రోహిత్, పంత్‌తో పాటు బుమ్రా, సూర్య, జడేజా, దూబే, సిరాజ్, అర్షదీప్, ఖలీల్, కుల్దీప్, అక్షర్ ఉన్నారు.
Similar News
News January 27, 2025
గవర్నర్, కేంద్ర మంత్రికి తప్పిన ప్రమాదం
TG: హుస్సేన్ సాగర్‌లో చేపట్టిన ‘భరతమాతకు మహా హారతి’ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రమాదం తప్పింది. కార్యక్రమం పూర్తైన వెంటనే ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంటనే చివరి అంకంగా బాణసంచా పేల్చగా పడవల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బందికి గాయాలయ్యాయి. నలుగురు ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
News January 27, 2025
విద్యార్థులకు నెలకు రూ.1,000 నగదు కానుక
హరియాణా ప్రభుత్వం విద్యార్థులకు నెలకు రూ.1,000 ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించింది. తొమ్మిది, పది తరగతులతోపాటు ఇంటర్ విద్యార్థులకూ ఈ అవార్డు ఇవ్వాలని భావించింది. తరగతిలో టాప్‌లో నిలిచిన ఓ అబ్బాయి, ఓ అమ్మాయికి ఈ నగదు ఇవ్వనుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు సర్కార్ పంపింది. ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ ఎంకరేజ్మెంట్ (EEE) పథకం కింద ఈ అవార్డు ప్రకటించింది.
News January 27, 2025
తిలక్ వర్మ ఇంకా సూపర్‌స్టార్ కాదు: మాజీ క్రికెటర్
టీమ్ ఇండియా క్రికెటర్ తిలక్ వర్మ సూపర్ స్టార్ అని కొందరు అంటున్నారని, కానీ ఆయన ఇంకా సూపర్ స్టార్ కాలేదని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. కానీ ఆవైపుగా ఆయన జర్నీ కొనసాగుతోందని చెప్పారు. ‘భారత్‌కు నమ్మకమైన మిడిలార్డర్ బ్యాటర్‌గా తిలక్ సత్తా చాటుతున్నారు. జట్టును కష్టాల్లోనుంచి బయటపడేస్తూ సూపర్ స్టార్‌గా ఎదుగుతున్నారు. అతని నిబద్ధత, నిలకడతో రాటుదేలుతున్నారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.