News March 7, 2025
MEA నివాస సముదాయంలో IFS అధికారి ఆత్మహత్య

ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల శాఖ నివాస సముదాయంలో జితేంద్ర రావత్ అనే ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. చాణక్యపురిలోని రెసిడిన్షియల్ కాంప్లెక్స్‌లో ప్రభుత్వం కేటాయించిన భవనంలో ఆయన ఉంటున్నారు. ఈరోజు ఉదయం 6గంటలకు భవనం పైనుంచి కిందికి దూకి సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆయన డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు సమాచారం.
Similar News
News March 23, 2025
EVల బీమాకు భారీగా పెరిగిన డిమాండ్

ఎలక్ట్రిక్ వాహనాల బీమాకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. గత మూడేళ్లలో 16 రెట్లు పెరిగినట్లు పాలసీబజార్ అంతర్గత డేటా చెబుతోంది. EV కార్ల బీమా పాలసీల వాటా FY23లో కేవలం 0.50%గా ఉండగా, మార్చి 2025 నాటికి 14%కి విస్తరించి 8.2% వద్ద నిలిచింది. ఢిల్లీ, బెంగళూరు, పుణే, చెన్నై, ముంబై సిటీల్లో ఈవీల వాడకం ఎక్కువగా ఉందని, 55% బీమా పాలసీలు ఈ నగరాల్లోనే కొనుగోలు చేస్తున్నట్లు పాలసీ బజార్ నివేదిక పేర్కొంది.
News March 23, 2025
యశ్వంత్ వర్మపై విచారణకు కమిటీ

జస్టిస్ <<15855484>>యశ్వంత్ వర్మ<<>> నివాసంలో భారీగా నగదు దొరకడంపై CJI అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పంజాబ్&హర్యానా HC CJ షీల్ నాగు, హిమాచల్‌ప్రదేశ్ HC CJ సంధవాలియా, కర్ణాటక HC CJ అను శివరామన్ ఉన్నారు. ఈ విచారణ సమయంలో వర్మకు ఎలాంటి న్యాయపరమైన పనులు అప్పగించవద్దని సీజేఐ ఆదేశించారు. పారదర్శకత కోసం ఢిల్లీ HC CJ రిపోర్ట్‌తో పాటు వర్మ స్టేట్‌మెంట్‌ను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు.
News March 23, 2025
కొత్త డీజీపీ ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

AP: కొత్త DGP ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు IPS అధికారుల పేర్లను కేంద్రానికి పంపింది. ఈ లిస్టులో రాజేంద్రనాథ్ రెడ్డి, మాదిరెడ్డి ప్రతాప్, హారీశ్ కుమార్ గుప్తా, కుమార్ విశ్వజిత్, సుబ్రహ్మణ్యం పేర్లు ఉన్నాయి. ఇందులో ముగ్గురి పేర్లను కేంద్రం తిరిగి రాష్ట్రానికి పంపనుంది. ప్రస్తుతం ఇన్‌ఛార్జ్ DGPగా ఉన్న హరీశ్ కుమార్‌నే మరో రెండేళ్లు DGPగా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.