News March 3, 2025
అమరావతి పనుల పరిశీలనకు ఐఐటీ నిపుణులు

AP: రాజధాని అమరావతిలోని ఐదు ఐకానిక్ టవర్ల పనులపై ప్రభుత్వం దృష్టిసారించింది. వీటి పునాదుల్లో నిలిచిన నీటిని గత నెలలో తోడించగా ర్యాఫ్ట్ ఫౌండేషన్ పరిశీలనకు ఈ వారంలో మద్రాస్ ఐఐటీ నిపుణులు రానున్నారు. కాంక్రీట్, రాడ్ల నమూనాలను పరీక్షించనున్నారు. కాగా గతంలో వీటి నిర్మాణానికి రూ.2,703 కోట్లతో టెండర్లు పిలవగా ఇప్పుడు వ్యయం 70 శాతం పెరిగినట్లు అంచనా. ఈ మేరకు CRDA మళ్లీ టెండర్లు ఆహ్వానించనుంది.
Similar News
News March 20, 2025
గన్ లైసెన్స్ ఇవ్వండి: రాజాసింగ్

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని బుల్లెట్ ప్రూప్ వెహికిల్, సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్లొద్దని సూచించారు. అయితే గోషామహల్ నియోజకవర్గంలో ఇరుకైన రోడ్లు ఉంటాయని అందులో బుల్లెట్ ప్రూప్ వెహికిల్ తిరగలేదని రాజాసింగ్ అన్నారు. భద్రత కోసం తనకు గన్ లైసెన్స్ ఇవ్వాలని ఎమ్మెల్యే పోలీసులను కోరారు.
News March 20, 2025
తను నిజమైన వర్కింగ్ ఉమెన్: ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రాకు జరిగిన ఒక ఆసక్తికర సంఘటనని ఇన్‌స్టాలో షేర్ చేశారు. తను వైజాగ్ ఎయిర్ పోర్ట్ వెళ్తున్న సమయంలో రోడ్డుపై తనకెంతో ఇష్టమైన జామ పండ్లు కనిపించాయట వాటి ఖరీదు రూ.150 అయితే ప్రియాంక రూ.200 ఇచ్చి ఉంచుకోమని చెప్పిందట, అప్పుడు పండ్లు అమ్మె మహిళ మిగిలిన డబ్బులకు సరిపడేలా కొన్ని పండ్లు ఇచ్చి వెళ్లిందట. తను నిజమైన వర్కింగ్ ఉమెన్ అని నా మనసు గెలిచిందని ప్రియాంక ఇన్‌స్టాలో షేర్ చేశారు.
News March 20, 2025
కుంభమేళాలో 1,000 మంది భక్తుల మిస్సింగ్: అఖిలేశ్ యాదవ్

ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో మిస్సయిన 1,000మంది భక్తుల జాడ కనుక్కోవడంలో ఉత్తరప్రదేశ్ సర్కార్ విఫలమైందని ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో తప్పిపోయిన వారి పోస్టర్లు ఉన్నాయన్నారు. యూపీ, MP ప్రభుత్వాలు కలిసి వెహికిల్ పార్కింగ్ ఏర్పాట్లు మాత్రమే చేశాయని దుయ్యబట్టారు. కుంభమేళా ఏర్పాట్లకు కేంద్రం ఎన్ని నిధులు కేటాయించిందో తెలపాలని అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు.