News April 30, 2024

IIT ఖరగ్‌పూర్‌: 33% మందికి రాని ఉద్యోగాలు!

image

ఐఐటీల్లో చదివితే రూ.లక్షల ప్యాకేజీతో కొలువులు సొంతం అనే మాట వింటూ ఉంటాం. ఇందుకు భిన్నంగా IIT ఖరగ్‌పూర్‌‌‌‌కు సంబంధించి ఆసక్తికర విషయం వెలుగు చూసింది. 2022-23 విద్యా సంవత్సరంలో 33% మంది విద్యార్థులకు ఉద్యోగాలు రాలేదట. 2,490 మంది ప్లేస్‌మెంట్స్ కోసం దరఖాస్తు చేస్తే 1,675 మందికే కొలువులు దక్కాయి. 2021-22లో 2,256 మందికి గాను 1,615 మందికి ఉద్యోగాలొచ్చాయి. సగటు వేతనం రూ.16లక్షల నుంచి రూ.18లక్షలుగా ఉంది.

Similar News

News October 29, 2025

ఎయిమ్స్ మదురైలో 84 పోస్టులు

image

<>ఎయిమ్స్ <<>>మదురై 84 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 24వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MD, MS, DM, M.Ch, PhD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్ పోస్టుకు గరిష్ఠ వయసు 58ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు గరిష్ఠ వయసు 50ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://aiimsmadurai.edu.in/

News October 29, 2025

రంగు చెప్పే ఆరోగ్య రహస్యం!

image

జీవనశైలి కారణంగా సంతానలేమి సమస్య పెరుగుతోంది. ఈక్రమంలో పురుషులు తమ ఆరోగ్య సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వీర్యం రంగును చెక్ చేసుకోవాలంటున్నారు. ఆకుపచ్చ రంగు ఇన్‌ఫెక్షన్ (STIs కూడా)కు సూచన కావొచ్చు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పసుపు రంగు యూరిన్ కలవడం లేదా సప్లిమెంట్ల ప్రభావమై ఉండొచ్చు. రెడ్ కలర్ రక్తానికి సంకేతం (వైద్య పరీక్ష అవసరం). తెలుపు/బూడిద రంగు హెల్తీ.

News October 29, 2025

మొదటి సంతానం అమ్మాయైతే వివక్ష తక్కువ

image

ప్రస్తుత సమాజంలో కొందరు ఆడపిల్లలపై ఇప్పటికీ వివక్ష చూపుతున్నారు. అయితే ఇళ్లల్లోనూ బిడ్డల మధ్య వివక్ష చూపడం సాధారణం అని భావిస్తారు. అయితే మొదటి సంతానం అమ్మాయి అయితే ఆ తండ్రుల్లో లింగ వివక్ష ధోరణి తక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అమ్మాయి పెరిగే క్రమంలో ఆమె ఎదుర్కొనే సవాళ్లే తండ్రి ఆలోచనా తీరులో ఈ మార్పుని తీసుకొస్తున్నాయని, దీన్నే మైటీ గర్ల్‌ ఎఫెక్ట్‌ అంటారని నిపుణులు చెబుతున్నారు.