News April 30, 2024
IIT ఖరగ్‌పూర్: 33% మందికి రాని ఉద్యోగాలు!

ఐఐటీల్లో చదివితే రూ.లక్షల ప్యాకేజీతో కొలువులు సొంతం అనే మాట వింటూ ఉంటాం. ఇందుకు భిన్నంగా IIT ఖరగ్‌పూర్‌కు సంబంధించి ఆసక్తికర విషయం వెలుగు చూసింది. 2022-23 విద్యా సంవత్సరంలో 33% మంది విద్యార్థులకు ఉద్యోగాలు రాలేదట. 2,490 మంది ప్లేస్‌మెంట్స్ కోసం దరఖాస్తు చేస్తే 1,675 మందికే కొలువులు దక్కాయి. 2021-22లో 2,256 మందికి గాను 1,615 మందికి ఉద్యోగాలొచ్చాయి. సగటు వేతనం రూ.16లక్షల నుంచి రూ.18లక్షలుగా ఉంది.
Similar News
News April 18, 2026
గ్రీన్ జెర్సీలో బరిలోకి దిగనున్న RCB

IPL-2026లో ఈరోజు RCBతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచులో ఆర్సీబీ గ్రీన్ కలర్ జెర్సీలో బరిలోకి దిగనుంది. ‘Go Green’ ఇనిషియేటివ్ కింద ఏటా ఒక హోమ్ మ్యాచ్‌లో ఆ జట్టు ప్లేయర్లు గ్రీన్ జెర్సీ ధరిస్తుంటారు. కాగా RCBలో ఈ ట్రెండ్ 2011 నుంచి కొనసాగుతోంది.
News April 18, 2026
జియో IPO.. టార్గెట్ రూ.50,000కోట్లు!

రిలయన్స్ జియో త్వరలో ఐపీఓకు రానున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో సెబీకి ఐపీవో పత్రాలను సమర్పించనుంది. సుమారు రూ.40,000-50,000కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఇదే జరిగితే దేశంలో అతిపెద్ద ఐపీఓగా రికార్డ్ నెలకొల్పనుంది. IPO నిర్వహణ కోసం 17 మర్చంట్ బ్యాంకింగ్ సంస్థలను జియో నియమించుకుంది. సంస్థ మార్కెట్ వాల్యూ రూ.16.72లక్షల కోట్లు కాగా ఇందులో 2.5% వాటా విక్రయించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
News April 18, 2026
‘మే’లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు?

తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలు కానుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ కోసం ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నెల 23లోపు ముసాయిదా జాబితా సిద్ధం చేసి అనంతరం విడుదల చేయనుంది. దీంతో వచ్చే నెలలో ఎలక్షన్స్ జరిగే అవకాశం కనిపిస్తోంది. కాగా గతేడాది జూన్‌తో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. ఇక రాష్ట్రంలో ఇటీవల సర్పంచ్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.


