News March 20, 2024
‘ఇళయరాజా’ ఫస్ట్ లుక్ విడుదల

దిగ్గజ సంగీత దర్శకుడు ‘ఇళయరాజా’ బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదలైంది. దీనిపై స్వయంగా ఆయనే స్పందిస్తూ.. ‘మొదట ఇది కేవలం నా వ్యక్తిగత ప్రయాణమే. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది సంగీత ప్రియుల హృదయాలను హత్తుకునే కథగా రూపాంతరం చెందింది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. ఇళయరాజాగా హీరో ధనుష్ కనిపించనున్నారు. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు.
Similar News
News February 12, 2026
ALERT: ఈ లింక్స్ క్లిక్ చేయకండి!

వాలంటైన్స్ వీక్ పేరుతో వచ్చే మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ‘సర్‌ప్రైజ్ గిఫ్ట్’ వంటి లింక్‌లను క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుందని తెలిపారు. తెలియని నంబర్ల నుంచి లేదా గ్రూపుల్లో వచ్చే లింక్స్‌ను నమ్మి వ్యక్తిగత వివరాలు షేర్ చేయవద్దని సూచించారు. ఒకవేళ మోసపోతే ‘గోల్డెన్ అవర్’లో 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని కోరారు.
News February 12, 2026
నార్త్ కొరియా తదుపరి లీడర్‌గా కిమ్ జు ఏ?

ఉత్తర కొరియా తదుపరి లీడర్‌గా కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె ‘కిమ్ జు ఏ’ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సౌత్ కొరియా నిఘా సంస్థ వెల్లడించింది. ఆమెను తన వారసురాలిగా ప్రకటించేందుకు కిమ్ సిద్ధమవుతున్నట్లు పేర్కొంది. ఇటీవల ఆమె కీలక సైనిక పర్యటనల్లో పాల్గొనడం, విధాన నిర్ణయాల్లో ఆమె అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వడం దీనికి బలం చేకూరుస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
News February 12, 2026
CEERIలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

CSIR-సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(<


