News April 29, 2024
ఇసుక అక్రమ తవ్వకాలు నిలిపివేయాలి: సుప్రీం
APలో ఇసుక అక్రమ తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇసుక అక్రమ తవ్వకాలపై వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఇసుక తవ్వకాలపై మే 9లోపు వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రం, AP ప్రభుత్వాన్ని ఆదేశించింది. NGT తీర్పుపై స్టే విధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని తిరస్కరించిన సుప్రీం.. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
Similar News
News November 12, 2024
బాలయ్య కొత్త సినిమా టీజర్ ఎప్పుడంటే?
నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తోన్న ‘NBK109’ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర టైటిల్ & టీజర్‌ను ఈనెల 15న ఉదయం 10.24గంటలకు విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించగా నాగవంశీ నిర్మించారు.
News November 12, 2024
వైసీపీని వీడటం లేదు: పండుల
AP:తాను YCPని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని MLC పండుల రవీంద్రబాబు ఖండించారు. ‘ఇదంతా తప్పుడు ప్రచారం. ప్రజలు ఈ వార్తలను నమ్మవద్దు. నాకు YCPని వీడాల్సిన అవసరం లేదు. జగన్‌తోనే నా ప్రయాణం. దేశంలో ఎవరూ చేయని విధంగా జగన్ తన పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. అన్ని కులాలతో సమానంగా దళితులకు పెద్ద పీట వేశారు. అలాంటి వ్యక్తిని, ఆ పార్టీ విలువలను వదిలి వెళ్లే ఆలోచన నాకు లేదు’ అని ఆయన వెల్లడించారు.
News November 12, 2024
సజ్జల భార్గవ్ రెడ్డికి లుకౌట్ నోటీసులు
AP: YCP సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డికి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మాజీ సీఎం జగన్ సమీప బంధువు అర్జున్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. పులివెందులలో నమోదైన అట్రాసిటీ కేసులో వీరు నిందితులుగా ఉన్నారు. విదేశాలకు పారిపోతారనే అనుమానంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. మరోవైపు గుంటూరులో నమోదైన కేసులో భార్గవ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈనెల 14కు వాయిదా వేసింది.