News April 4, 2024
‘నేను విస్కీకి అభిమానిని’.. అడ్వకేట్, CJI మధ్య సరదా సంభాషణ

ఇండస్ట్రియల్ ఆల్కహాల్ కేసు విచారణ సందర్భంగా CJI చంద్రచూడ్, సీనియర్ అడ్వకేట్ దినేశ్ ద్వివేది మధ్య సరదా సంభాషణ జరిగింది. తన జుట్టుకు రంగులు ఉన్నందుకు క్షమించమని దినేశ్ CJIని కోరారు. హోలీ పండగ, ఇంట్లో మనమళ్లు ఉండటంతో తప్పలేదన్నారు. ఆల్కహాల్తో సంబంధం లేదా? అని CJI అడగగా ‘ఉంది.. హోలీ అంటే సగం ఆల్కహాలే. నేను విస్కీకి అభిమానిని’ అని దినేశ్ బదులు ఇవ్వడంతో కోర్టు రూమ్లో నవ్వులుపూశాయి.
Similar News
News November 24, 2025
అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనని పెద్దపల్లి ఎంపీ

పెద్దపల్లి జిల్లాలో ఈ రోజు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ వంశీకృష్ణ హాజరు కాలేదు. గతంలో కాళేశ్వరం పుష్కరాలు, ఈఎస్ఐ ఆసుపత్రి కార్యక్రమాల్లోనూ ఎంపీని పక్కనపెట్టిన ఘటనలు ఉన్న నేపథ్యంలో, తాజా పరిణామం ఎమ్మెల్యేలు-ఎంపీ మధ్య సమన్వయ లోపాన్ని మరింత స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలు పాల్గొనే అధికారిక కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొనకపోవడం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
News November 24, 2025
రియల్ కంపెనీలపై ఈడీ రైడ్స్ కలకలం

హైదరాబాద్లోని 8 రియల్ ఎస్టేట్ కంపెనీలపై ED దాడులు చేసింది. జయత్రి, జనప్రియ, రాజా డెవలపర్స్, శ్రీ గాయత్రి హోమ్స్, శివసాయి కన్స్టక్షన్స్ తదితర కంపెనీల్లో అగ్రిమెంట్స్, హార్డ్ డ్రైవ్స్ సహా పలు డాక్యుమెంట్స్, డిజిటల్ అసెట్స్ సీజ్ చేశారు. ప్రి లాంఛ్ పేరుతో కస్టమర్స్ నుంచి జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రూ.60 కోట్లు తీసుకుని షెల్ కంపెనీలకు మళ్లించిందని వచ్చిన కంప్లైంట్స్పై ఈ రైడ్స్ జరిగాయి.
News November 24, 2025
యూకేని వీడనున్న మిట్టల్!

భారత సంతతి వ్యాపారవేత్త లక్ష్మీ ఎన్. మిట్టల్ యూకేని వీడనున్నారు. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెరగడం, కుటుంబ వ్యాపారాలపై కొత్త రూల్స్, ప్రపంచంలో ఎక్కడ సంపాదించినా యూకేలో పన్ను చెల్లించాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన పన్నులు లేని దుబాయ్లో సెటిల్ కానున్నారు. ఇప్పటికే అక్కడ ఓ ల్యాండ్ కొన్నారు. కాగా మిట్టల్ $21.4 బిలియన్ల సంపదతో ప్రపంచ ధనవంతుల్లో 104వ స్థానంలో ఉన్నారు.


