News April 4, 2024
‘నేను విస్కీకి అభిమానిని’.. అడ్వకేట్, CJI మధ్య సరదా సంభాషణ

ఇండస్ట్రియల్ ఆల్కహాల్ కేసు విచారణ సందర్భంగా CJI చంద్రచూడ్, సీనియర్ అడ్వకేట్ దినేశ్ ద్వివేది మధ్య సరదా సంభాషణ జరిగింది. తన జుట్టుకు రంగులు ఉన్నందుకు క్షమించమని దినేశ్ CJIని కోరారు. హోలీ పండగ, ఇంట్లో మనమళ్లు ఉండటంతో తప్పలేదన్నారు. ఆల్కహాల్‌తో సంబంధం లేదా? అని CJI అడగగా ‘ఉంది.. హోలీ అంటే సగం ఆల్కహాలే. నేను విస్కీకి అభిమానిని’ అని దినేశ్ బదులు ఇవ్వడంతో కోర్టు రూమ్‌లో నవ్వులుపూశాయి.
Similar News
News February 9, 2026
ఎప్‌స్టీన్ మరణశాసనం.. ఒక రోజు ముందే రాసేశారా?

US లైంగిక నేరస్థుడు ఎప్‌స్టీన్ 2019 AUG 10న మాన్‌హట్టన్ జైల్లో అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే. అయితే అతడి మరణ ప్రకటన AUG 9వ తేదీనే రూపొందించినట్టు తాజాగా విడుదలైన ఫైల్స్ చూపిస్తున్నాయి. అది ఆత్మహత్య అని అధికారులు చెప్పినా తేదీలో వ్యత్యాసం అనుమానాలు రేకెత్తిస్తోంది. దీనితో పాటు 9వ తేదీ రాత్రి CCTV దృశ్యాలు, చనిపోయాక తీసిన ఫొటోల్లో అతడి ఫస్ట్ నేమ్ తప్పుగా ఉండటంతో అనుమానాలు బలపడుతున్నాయి.
News February 9, 2026
కల్తీ జరిగింది మీ హయాంలో కాదా: విడదల రజిని

AP: కల్తీ నెయ్యి వ్యవహారంలో CM CBNకు మాజీ మంత్రి విడదల రజిని కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘2024 JULY 6న వచ్చిన 2 ట్యాంకర్లు, JULY 12న వచ్చిన మరో 2 ట్యాంకర్ల నెయ్యిని TTD ల్యాబ్ పరీక్షించి, నాణ్యతా ప్రమాణాలు లేవని వెనక్కి పంపింది వాస్తవం కాదా? ఆ లారీలు దొడ్డిదారిన తిరిగి వచ్చింది మీ పాలనలోనే కదా? ఒకవేళ కల్తీ జరిగి ఉంటే అది మీ హయాంలోనే కదా? దీనికి మీ సమాధానమేంటి?’ అని ట్వీట్ చేశారు.
News February 9, 2026
అసెంబ్లీకి జగన్, వైసీపీ MLAలు?

AP: ఎల్లుండి నుంచి జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు YCP అధినేత జగన్, ఆ పార్టీ MLAలు హాజరవనున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకరోజే అసెంబ్లీకి వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. సభకు హాజరై 6 నెలల సమయం గడిచిన నేపథ్యంలో అనర్హత వేటు పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అదే రోజు జగన్ అధ్యక్షతన YCP శాసనసభాపక్ష సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది.


