News December 26, 2024
పెళ్లంటే భయం.. రొమాన్స్ అంటే ఇష్టం: శృతి హాసన్
తన వివాహం గురించి హీరోయిన్ శృతి హాసన్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఆమె తన ప్రియుడు శాంతనుతో వివాహం చేసుకుంటారని వార్తలు రాగా దీనిని ఆమె ఖండించారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో అడగటం ఇక ఆపేయండంటూ సూచించారు. ‘నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ రిలేషన్‌లో ఉండేందుకు ఇష్టపడతా. నాకు రొమాన్స్ అంటే ఇష్టం. ఒకరితో నన్ను నేను ఎక్కువగా అటాచ్ చేసుకోవాలంటే కొంచెం భయంగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.
Similar News
News December 27, 2024
మన్మోహన్ జీవితం ఎందరికో స్ఫూర్తి
మన్మోహన్ సింగ్ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చని ఆయన నిరూపించారు. పేద కుటుంబంలో జన్మించిన ఆయన ఆధునిక భారతదేశ పితామహుడిగా మార్చింది చదువు, తెలివితేటలే. అమెరికా అధ్యక్షుడు ఒబామాతో సమావేశమైన తర్వాత ఆయన జ్ఞానానికి ముగ్ధుడై సింగ్‌కు సెండాఫ్ ఇచ్చేందుకు వైట్‌హౌస్ బయటకొచ్చి గౌరవించారు. 2014లో మాజీ ప్రధాని అయ్యాక జపాన్ రెండో అత్యున్నత పురస్కారంతో సత్కరించారు.
News December 27, 2024
US: 240 ఏళ్ల తర్వాత బాల్డ్ ఈగల్‌కు జాతీయ పక్షి హోదా
అమెరికా జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్‌ను అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ ఆమోదించిన బిల్లుపై ఆయన సంతకం చేశారు. 1782 నుంచి ఈ పక్షిని అమెరికా చిహ్నంగా వాడుతున్నా అధికారిక హోదా మాత్రం కల్పించలేదు. 240 ఏళ్ల తర్వాత బైడెన్ దీనికి ఇటీవల ఆమోద ముద్ర వేశారు. ఈ పక్షికి తెల్లటి తల, పసుపు రంగు ముక్కు, గోధుమ రంగులో శరీరం ఉంటుంది.
News December 27, 2024
బలహీనపడిన అల్పపీడనం.. ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దాదాపు 10 రోజుల తర్వాత బలహీనపడింది. ఉపరితల ఆవర్తనం కారణంగా ఇవాళ APలోని ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య , చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ పలుచోట్ల వానలు పడే అవకాశం ఉందంది. కాగా ఇక వచ్చే వేసవి వరకు అల్పపీడనాలు, భారీ వర్షాలకు ఛాన్స్ లేదని పేర్కొంది.