News March 18, 2024

నేను క్షేమంగానే ఉన్నా: మంగ్లీ

image

కారు ప్రమాదంలో తనకు స్వల్ప గాయాలు అయినట్లు వస్తోన్న వార్తలను సింగర్ మంగ్లీ ఖండించారు. తనకు ప్రమాదం జరిగిందని తెలిసి అభిమానులు సైతం ఆందోళన చెందుతున్నారని, తాను క్షేమంగానే ఉన్నట్లు ఆమె ఇన్‌స్టా వేదికగా ప్రకటించారు. ‘ఇది అనుకోకుండా జరిగిన చిన్న ప్రమాదం. ఈ యాక్సిడెంట్ రెండ్రోజుల క్రితం జరిగింది. రూమర్స్‌ను నమ్మకండి. మీరు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు’ అని తెలిపారు.

Similar News

News October 11, 2024

తండ్రిని పట్టించుకోని కొడుకులకు RDO షాక్

image

TG:వృద్ధాప్యంలో తండ్రికి నీడగా నిలవాల్సిన కొడుకులు కాదనుకున్నారు. సిరిసిల్ల(D) తంగళ్లపల్లిలో తండ్రి రాజమల్లు పేరుతో రావాల్సిన డబుల్ బెడ్ రూమ్‌ను భార్య పేరుతో పెద్ద కొడుకు రాయించుకున్నాడు. 6 నెలలుగా ఇద్దరు కొడుకులూ పట్టించుకోకపోవడంతో భిక్షాటన చేస్తూ కడుపునింపుకుంటున్నాడు. ఇటీవల ఫిర్యాదు చేయడంతో కొడుకు డబుల్ బెడ్ రూమ్ ఇంటిని RDO తండ్రికి కేటాయించారు. ఆయనకు నెలకు ₹2000 ఇవ్వాలని కొడుకులను ఆదేశించారు.

News October 11, 2024

రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్

image

దివంగత రతన్ టాటా దేశానికి చేసిన సేవకు గుర్తుగా భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ప్రజల నుంచి పెరుగుతోంది. గొప్ప మానవతావాది అయిన టాటా నిజమైన రత్నమని, ఆయనను అత్యున్నత పురస్కారంతో గౌరవించుకోవడం సముచితమని పేర్కొంటున్నారు. తాజాగా మహారాష్ట్ర క్యాబినెట్ కూడా ఆయనకు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసింది. కాగా నిన్న కోట్లాది మంది అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి.
* టాటాకు ‘భారతరత్న’ డిమాండ్‌పై మీరేమంటారు?

News October 11, 2024

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్

image

AP: కేంద్ర పథకం PMFMEని రాష్ట్రంలో మహిళ ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనుసంధానించనుంది. డ్వాక్రా సంఘాల్లో ఉంటూ ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ ఆసక్తి ఉన్న మహిళలకు కేవలం 6 శాతం వడ్డీకి రూ.40వేల చొప్పున రుణం మంజూరు చేయనుంది. దీన్ని రెండేళ్లలో చెల్లించాలి. ఈ ఏడాది 10వేల మందికి అమలుచేసేందుకు కసరత్తు జరుగుతోంది. కేంద్రం రూ.40 కోట్లు విడుదలకు అనుమతివ్వగా, వారం రోజుల్లోనే మహిళల ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి.