News June 3, 2024
జైలుకు వెళ్లేందుకు నాకు ఓకే.. కానీ: డొనాల్డ్ ట్రంప్
హష్ మనీ కేసులో తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధమని US మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కానీ ప్రజలు నుంచి దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి ఇందుకు బదులు తీర్చుకుంటానని తెలిపారు. గతంలో ఓ అడల్ట్ స్టార్‌కు చేసిన చెల్లింపులను 2016 ఎన్నికలప్పుడు సమర్పించిన వివరాల్లో ట్రంప్ కప్పిపుచ్చినట్లు కోర్టు విచారణలో తేలింది.
Similar News
News September 17, 2024
నేటి ముఖ్యాంశాలు
* TG: సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ
* రాజీవ్ విగ్రహాన్ని తొలగించేదెవడ్రా.. రండి: CM రేవంత్ రెడ్డి
* తెలంగాణ తల్లిని అవమానిస్తారా?: KTR
* వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ
* AP: ఐటీలో ప్రతి నలుగురిలో ఒకరు తెలుగువారే: CBN
* రాజధాని రైతుల ఖాతాల్లో కౌలు డబ్బులు జమ
* చంద్రబాబు పేదల వ్యతిరేకి: జగన్
* కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచార కేసు
News September 17, 2024
ఇరాన్ సుప్రీం లీడర్‌కు భారత్ కౌంటర్
భారత్, గాజా, మయన్మార్ వంటి దేశాల్లో ముస్లింల పరిస్థితిని ఉద్దేశించి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమెనీ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఆయన వ్యాఖ్యలను స్వీకరించబోమని విదేశాంగ శాఖ Xలో ట్వీట్ చేసింది. మైనార్టీలను ఉద్దేశించి మాట్లాడే దేశాలు తమ దేశంలోని పరిస్థితులను ముందుగా పరిశీలించుకోవాలని చురకలు అంటించింది.
News September 17, 2024
ఢిల్లీలో మరో అంతర్జాతీయ స్టేడియం
ఢిల్లీలో కొత్తగా ద్వారక అంతర్జాతీయ స్టేడియం నిర్మించనున్నారు. దీనిని క్రికెట్ కమ్ ఫుట్‌బాల్ స్టేడియంగా DDA (ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ) రూపొందించనుంది. రూ.1,500 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ స్టేడియంలో స్విమ్మింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, టీటీ వంటి ఆటలు ఆడేందుకు సౌకర్యాలు ఉంటాయి. 30 వేల మంది కెపాసిటీతో దీనిని నిర్మిస్తారు. ఈ ఏడాది చివర్లో పనులు ప్రారంభించి 2027 సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తారు.