News November 17, 2024
బొద్దింకలు, పురుగులను వడ్డిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి: కాంగ్రెస్ MP
వందే భారత్ రైళ్లలో నాణ్యతలేని ఆహారాన్ని సరఫరా చేస్తుండడంపై కాంగ్రెస్ MP మాణికం ఠాగూర్ తీవ్రంగా స్పందించారు. 8 నెలల పాటు భోజనంలో బొద్దింకలు, పురుగులు వడ్డిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ ప్రధాని మోదీకి చురకలంటించారు. ఈ పరిస్థితుల్లో బాధ్యులపై కేవలం ₹50 వేల జరిమానా విధిస్తే సరిపోతుందా అంటూ నిలదీశారు. ప్రయాణికుల భద్రత కోసం కఠినంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.
Similar News
News December 14, 2024
KTRను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే: పాడి కౌశిక్ రెడ్డి
TG: హీరో అల్లు అర్జున్‌ను నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేయడం దారుణమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. నిన్ననే బెయిల్ పేపర్లు అందినా జైలు అధికారులు ఆయనను ఇవాళ రిలీజ్ చేయడం ఏంటని నిలదీశారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారని అంటున్నారని, ఆయనను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు.
News December 14, 2024
ICUలో అద్వానీ: లేటెస్ట్ హెల్త్ అప్డేట్
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని LK అద్వానీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ఢిల్లీ అపోలో ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నాయి. నిజానికి రెండు రోజుల క్రితమే ఆయన ఆస్పత్రికి వచ్చారని తెలిసింది. శనివారం మాత్రం ICUలో అడ్మిట్ చేశారు. సీనియర్ న్యూరాలజిస్ట్ వినిత్ సూరీ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 97ఏళ్ల అద్వానీ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు.
News December 14, 2024
భారీగా తగ్గిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.980 తగ్గి రూ.77,890కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.900 తగ్గి రూ.71,400గా ఉంది. మరోవైపు సిల్వర్ ధర కూడా కేజీపై రూ.వెయ్యి తగ్గింది. దీంతో ప్రస్తుతం లక్ష రూపాయలుగా ఉంది.