News September 29, 2024

ఐమ్యాక్స్, జలవిహార్‌ను కూల్చాలి: దానం నాగేందర్

image

TG: హైడ్రాపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మురికవాడల జోలికి వెళ్లొద్దని హైడ్రాకు ముందే సూచించా. పేదల ఇళ్లు కూలగొట్టడం సమంజసం కాదు. కూలగొట్టడానికి ఐమ్యాక్స్, జలవిహార్ లాంటివి చాలా ఉన్నవి. మూసీ బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఇళ్లు కూలగొట్టాల్సింది. ఇళ్లకు మార్కింగ్ చేయడం తొందరపాటు చర్య. ఈ అంశాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తా’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News October 6, 2024

చెన్నైలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి

image

చెన్నై మెరీనా బీచ్‌లో ఎయిర్‌షో సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. ఎయిర్‌షో చూసేందుకు లక్షలాది మంది తరలిరావడంతో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరింత మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒకరు ఏపీకి చెందిన వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు. సుమారు 100 మంది స్థానిక ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

News October 6, 2024

ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. రేపు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరద నష్టం వివరాలను షాకు అందించనున్నట్లు సమాచారం. అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే హోంమంత్రుల సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పెద్దలతో సమావేశం అవుతారు. రాష్ట్రంలో క్యాబినెట్ విస్తరణ, తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

News October 6, 2024

కాసేపట్లో వర్షం

image

తెలంగాణలోని 8 జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వికారాబాద్, వరంగల్, హన్మకొండ, కొత్తగూడెం, భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షం కురవనుందని పేర్కొంది. మరోవైపు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వాన పడింది.