News September 13, 2024

లక్ష విగ్రహాల నిమజ్జనం.. 25వేల మందితో బందోబస్తు: CP

image

TG: ఈ నెల 17న గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా 25 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఖైరతాబాద్ మహాగణపతిని మధ్యాహ్నం 1.30 గంటల్లోపు నిమజ్జనం చేసేందుకు నిర్వాహకులు అంగీకరించారని తెలిపారు. నగరవ్యాప్తంగా సుమారు లక్ష విగ్రహాలు హుస్సేన్‌సాగర్ ఒడికి చేరుకుంటాయని పేర్కొన్నారు.

Similar News

News January 1, 2026

డ్రంకెన్ డ్రైవ్.. రీడింగ్ చూస్తే షాకే!

image

TG: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ మందుబాబు రీడింగ్ చూసి పోలీసులు అవాక్కయ్యారు. నిన్న రాత్రి వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో ఓ వ్యక్తికి బ్రీత్ అనలైజర్‌తో చెక్ చేయగా ఏకంగా 438 రీడింగ్ నమోదైంది. న్యూఇయర్ వేళ డ్రంకెన్ డ్రైవ్‌లో నమోదైన రీడింగ్‌ల్లో ఇదే అత్యధికమని ఏఎస్పీ శుభం ప్రకాశ్ తెలిపారు. కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.

News January 1, 2026

పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత దేవా

image

TG: మావోయిస్టు పార్టీ అగ్రనేత బర్సె దేవా అలియాస్ సుక్కాను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామానికి చెందిన దేవాపై రూ.50 లక్షల రివార్డు ఉందని పోలీసులు చెబుతున్నారు. మరో 15 మంది కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. వారందరినీ వెంటనే కోర్టులో హాజరుపరచాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది. మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో కలిసి దేవా గతంలో పనిచేశారు.

News January 1, 2026

పారా మెడికల్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు

image

AP: పారా మెడికల్ విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలైతే ఆ సబ్జెక్టులను యాన్యువల్ ఎగ్జామ్స్‌తో పాటు మళ్లీ రాసేవారు. ఫలితంగా ఏడాదిపాటు వేచి ఉండాల్సి వచ్చి ఉపాధి అవకాశాలు కోల్పోయేవారు. కాగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో వారికి 2025-26 నుంచి తొలిసారిగా సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. FEB 2, 3, 4 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 5వ తేదీవరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.