News September 13, 2024
లక్ష విగ్రహాల నిమజ్జనం.. 25వేల మందితో బందోబస్తు: CP
TG: ఈ నెల 17న గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా 25 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఖైరతాబాద్ మహాగణపతిని మధ్యాహ్నం 1.30 గంటల్లోపు నిమజ్జనం చేసేందుకు నిర్వాహకులు అంగీకరించారని తెలిపారు. నగరవ్యాప్తంగా సుమారు లక్ష విగ్రహాలు హుస్సేన్‌సాగర్ ఒడికి చేరుకుంటాయని పేర్కొన్నారు.
Similar News
News October 14, 2024
సిరి లెల్ల.. పల్నాడు అమ్మాయే
హీరో నారా రోహిత్‌తో హీరోయిన్ సిరి లెల్ల నిశ్చితార్థం జరిగింది. కాగా సిరి పూర్తి పేరు శిరీషా. ఈమెది పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల. శిరీషాకు నలుగురు తోబుట్టువులు. పెద్దమ్మాయి శ్రీలక్ష్మీ రెంటచింతలలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్. రెండో అమ్మాయి భవానీ పెళ్లి చేసుకుని USలో, మూడో అమ్మాయి ప్రియాంక వివాహం చేసుకుని HYDలో స్థిరపడ్డారు. ప్రియాంక వద్ద ఉంటూ శిరీషా సినిమా ప్రయత్నాలు చేశారు.
News October 14, 2024
ఇజ్రాయెల్‌కు US అత్యాధునిక ఆయుధాల సాయం
ఇరాన్ హెచ్చరిస్తున్నా ఇజ్రాయెల్‌కు సాయం చేయడంలో అమెరికా ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఇజ్రాయెల్‌కు అత్యాధునికమైన థాడ్(టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్)బ్యాటరీతో పాటు సైనిక దళాలను కూడా యూఎస్ పంపింది. శత్రు దేశాలు ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను థాడ్ కూల్చేస్తుంది. మరోవైపు తమ ప్రజలు, ప్రయోజనాలు కాపాడుకునేందుకు ఎంతకైనా తెగిస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది.
News October 14, 2024
BIG ALERT: భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు
AP: బంగాళాఖాతంలో నేడు ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో 4 రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది. మంగళ, బుధ, గురువారాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.