News September 17, 2024

రేపు ఉదయంలోగా నిమజ్జనాలు పూర్తి: సీపీ

image

TG: హైదరాబాద్ నగరంలో వినాయకుల నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. రేపు ఉదయం నాటికి ఈ ప్రక్రియ ముగుస్తుందని చెప్పారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు ప్రైవేట్ వాహనాలు కాకుండా ప్రజారవాణాను ఉపయోగించుకోవాలని సూచించారు. అటు నిమజ్జన ప్రక్రియను మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి, సీవీ ఆనంద్ హెలికాప్టర్ ద్వారా వీక్షించారు.

Similar News

News October 14, 2024

రేపటి నుంచి స్కూళ్లు

image

తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు నేటితో దసరా సెలవులు ముగియనున్నాయి. రేపటి నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. కాలేజీలు మాత్రం నేటి నుంచే తెరుచుకోనున్నాయి. అటు ఏపీలో నేటి నుంచి పాఠశాలలు, కాలేజీలు స్టార్ట్ అవుతాయి. ఈ నెల 2 నుంచి 13 వరకు దసరా సెలవుల అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతులకు హాజరుకానున్నారు. కాగా ఇంటర్ కాలేజీలను ఉ.9 గంటల నుంచి సా.5 గంటల వరకు నిర్వహించనున్నారు.

News October 14, 2024

కాల్పులకు సిద్ధంగా ఉండాలని ఆర్మీకి నార్త్ కొరియా ఆదేశాలు

image

దక్షిణ కొరియా తమ దేశంలోకి డ్రోన్లను పంపిస్తోందని ఆరోపిస్తూ తమ సైన్యాన్ని నార్త్ కొరియా సమాయత్తం చేసింది. అనుమానాస్పదంగా ఏ వస్తువు కనిపించినా వెంటనే కాల్చేయాలని స్పష్టం చేసింది. తమ అధినేత కిమ్‌ను విమర్శించే పార్సిళ్లను దక్షిణ కొరియా పంపుతోందని ప్యాంగ్యాంగ్ ఆరోపిస్తోంది. అయితే, ఆ ఆరోపణల్ని సియోల్ కొట్టిపారేస్తోంది. వాటిని తాము పంపడం లేదని తేల్చిచెబుతోంది.

News October 14, 2024

J&Kలో రాష్ట్రపతి పాలన ఎత్తివేత

image

జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా J&K ముఖ్యమంత్రిగా ఈ నెల 16న ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్-ఎన్సీ కూటమి నాయకుడిగా అబ్దుల్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.