News May 20, 2024

ఏపీపై తుఫాను ప్రభావం?

image

బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడనుండగా.. ఈ నెల 24 నాటికి అది ఈశాన్య దిశగా పయనించి వాయుగుండంగా బలపడనుంది. ఇది తుఫానుగా మారే అవకాశం ఉందన్న అంచనాలతో ఏ దిశగా పయనిస్తుందన్న దానిపై 2-3 రోజుల్లో స్పష్టత రానుంది. సహజంగా అండమాన్ సమీపంలో ఏర్పడే తుపాన్లలో అధికంగా బంగ్లాదేశ్ సమీపంలో తీరం దాటుతాయని.. ఈ తుపాను ప్రభావం APపై ఉంటుందా? లేదా? అన్న దానిపై త్వరలో స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Similar News

News December 7, 2024

18న గురుకుల సొసైటీ ప్రవేశాలకు నోటిఫికేషన్

image

TG: గురుకుల సొసైటీ ప్రవేశాలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి తెలిపారు. ఫిబ్రవరి 23న రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. జూన్ 12లోగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అలాగే 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రవేశాలకు ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించడం లేదని వెల్లడించారు. పది పాసైన వారికి నేరుగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు కల్పిస్తామన్నారు.

News December 7, 2024

తెలంగాణలోనే ఎక్కువ సిజేరియన్లు

image

తెలంగాణలో సిజేరియన్లు ఎక్కువగా ఉన్నట్లు NFHS ఆధారంగా ఢిల్లీలోని జార్జ్ ఇన్‌స్టిట్యూట్ స్టడీ తెలిపింది. ఇక్కడ మొత్తం ప్రసవాల్లో 60.7% సిజేరియన్లేనని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇది 21.5 శాతంగా ఉంది. అత్యల్పంగా నాగాలాండ్‌లో 5.2% సిజేరియన్లు జరుగుతున్నాయి. దక్షిణాదిలోనే సిజేరియన్లు ఎక్కువగా ఉన్నాయి. సహజ ప్రసవాలపై భయం, ముహూర్తాలు చూసుకోవడం, ఆర్థిక స్తోమత వంటి అంశాలు సిజేరియన్లకు కారణాలవుతున్నాయి.

News December 7, 2024

TFDC ఛైర్మన్‌గా నిర్మాత దిల్ రాజు

image

TG: సినీ నిర్మాత దిల్ రాజుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రాజును నియమిస్తూ CS శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగుతారు. కాగా గత ఎన్నికల్లో దిల్ రాజు కాంగ్రెస్ తరఫున MP లేదా MLAగా పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగలేదు. తెర వెనుక ఆయన కాంగ్రెస్‌కు మద్దతిచ్చినట్లు టాక్.