News July 17, 2024
త్వరలో ఫేమ్-3 అమలు: కేంద్ర మంత్రి

ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన ఫేమ్ పథకం మూడో దశను త్వరలోనే అమలు చేస్తామని కేంద్ర మంత్రి కుమారస్వామి తెలిపారు. వచ్చే బడ్జెట్లో దీనిపై ఎలాంటి ప్రకటన ఉండబోదన్నారు. ఫేమ్-3 అమలుపై మంత్రిత్వ శాఖల నుంచి సిఫార్సులు అందాయని తెలిపారు. హైబ్రిడ్ వాహనాల పన్ను తగ్గింపుపై ప్రధాని అధ్యక్షతన నిర్ణయం తీసుకుంటామన్నారు. దానికి అనుగుణంగా ఆర్థిక శాఖ ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు.
Similar News
News December 18, 2025
పుస్తకాల పండుగ రేపటి నుంచే

TG: హైదరాబాద్లో రేపటి నుంచి నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం కానుంది. ఈ నెల 29 వరకు 11 రోజుల పాటు కొనసాగనుంది. ఎన్టీఆర్ స్టేడియంలో మొత్తం 365 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. రోజూ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 వరకు బుక్ ఫెయిర్ ఓపెన్లో ఉంటుంది. గతేడాది 10 లక్షల మంది వచ్చారని, ఈ ఏడాది 12-15 లక్షల మంది వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. బుక్ ఫెయిర్ ప్రాంగణానికి దివంగత కవి అందెశ్రీ పేరు పెట్టారు.
News December 18, 2025
వచ్చే 4 రోజులు మరింత చలి

TG: రాష్ట్రంలో నేటి నుంచి 4 రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 18 నుంచి 21 వరకు సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలు చలి గుప్పిట్లో చిక్కుకున్నాయి. బుధవారం సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో 7.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ జిల్లా దామరంచలో 10 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా పోతిరెడ్డి పేటలో 9.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News December 18, 2025
పాడి రైతులకు అండగా ముర్రా జాతి గేదెలు

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందాలన్నదే ప్రతి పాడి రైతు కల. అందుకు మనం ఎంచుకునే పశుజాతి, పోషణ కీలకం. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ముర్రా జాతి గేదెలతో పాడిరైతుల కలలు నిజమవుతాయంటున్నారు వెటర్నరీ నిపుణులు. ఎందుకంటే ప్రపంచంలో అత్యధిక, మేలైన పాల ఉత్పత్తికి, స్థిరమైన ఆదాయానికి ముర్రాజాతి గేదెలు ప్రసిద్ధి చెందాయి. ఈ గేదెలతో డెయిరీఫామ్ నిర్వహణ ఎందుకు లాభదాయకమో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


