News July 17, 2024

త్వరలో ఫేమ్-3 అమలు: కేంద్ర మంత్రి

image

ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన ఫేమ్ పథకం మూడో దశను త్వరలోనే అమలు చేస్తామని కేంద్ర మంత్రి కుమారస్వామి తెలిపారు. వచ్చే బడ్జెట్లో దీనిపై ఎలాంటి ప్రకటన ఉండబోదన్నారు. ఫేమ్-3 అమలుపై మంత్రిత్వ శాఖల నుంచి సిఫార్సులు అందాయని తెలిపారు. హైబ్రిడ్ వాహనాల పన్ను తగ్గింపుపై ప్రధాని అధ్యక్షతన నిర్ణయం తీసుకుంటామన్నారు. దానికి అనుగుణంగా ఆర్థిక శాఖ ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు.

Similar News

News July 10, 2025

17వేలకు పైగా ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ సిద్ధం: పొన్నం

image

TG: నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాష్ట్రం ఏర్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ‘కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వంలో 60వేల ఉద్యోగాలు ఇచ్చాం. 17వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉంది. వచ్చే మార్చిలోపు మొత్తం లక్ష ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల‌పై ఆఫీసర్స్ కమిటీ వేసి స్ట్రీమ్‌లైన్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం’ అని మంత్రి వివరించారు.

News July 10, 2025

భూకంపాలు ఎందుకు వస్తాయంటే?

image

భూమి ఆకస్మికంగా కంపించడాన్నే భూకంపం అంటారు. భూమి లోపల టెక్టానిక్ ప్లేట్లు బలంగా కదిలినప్పుడు భూకంపం వస్తుంది. భూపాతాలు, హిమపాతాలు, సొరంగాలు, గనుల పైకప్పులు కూలినప్పుడు ఇవి సంభవిస్తాయి. దీని తీవ్రత ఎక్కువగా ఉంటే ప్రకంపనలు చాలా దూరం వ్యాపిస్తాయి. రిక్టర్ స్కేల్‌పై 7 దాటితే భవనాలు పేకమేడల్లా కూలుతాయి. రోడ్లు చీలిపోతాయి. భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తుంది.

News July 10, 2025

PHOTO GALLERY: ‘మెగా PTM’లో CBN, లోకేశ్

image

AP: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఇవాళ జరిగిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్-2025(PTM)లో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ బిజీబిజీగా గడిపారు. విద్యార్థులతో వారు ముఖాముఖి నిర్వహించి ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించారు. పిల్లలకు సీఎం పాఠాలు చెప్పారు. సీఎం, మంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఇవాళ్టి కార్యక్రమాలకు సంబంధించి వారు Xలో ఫొటోలు షేర్ చేశారు.