News September 30, 2024
స్కూళ్లకు కీలక ఆదేశాలు
AP: ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులందరికీ OCT 14లోగా APAAR(ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) కార్డులు ఇవ్వాలని విద్యాశాఖ ఆదేశించింది. దీనిపై తల్లిదండ్రుల్లోనూ అవగాహన కల్పించాలని సూచించింది. ఈ కార్డులో విద్యార్థి పేరు, బర్త్‌డే, ఫొటో, క్యూఆర్ కోడ్, 12 అంకెలతో గుర్తింపు నంబర్ ఉంటుంది. పిల్లల అకడమిక్ సమాచారం, ప్రోగ్రెస్ వివరాలన్నీ ఇందులో నిక్షిప్తమవుతాయి.
Similar News
News October 11, 2024
Stock Market: నష్టాల్లో ముగిశాయి
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 230 పాయింట్ల నష్టంతో 81,381 వద్ద, నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో 24,964 వద్ద స్థిరపడ్డాయి. ఉదయం గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయిన సూచీలు ఏ దశలోనూ Day Highని క్రాస్ చేయలేదు. Trent, Hindalco, Hcl Tech, TechM, Ongc టాప్ గెయినర్స్. TCS, M&M, Icici, Cipla, AdaniEnt టాప్ టూజర్స్. బ్యాంక్, ఆటో, ఫైనాన్స్ సర్వీస్ రంగ షేర్లు నష్టపోయాయి.
News October 11, 2024
రాత్రి 7గంటలకు ముగియనున్న లిక్కర్ షాపుల దరఖాస్తు గడువు
ఏపీలో మద్యం షాపుల దరఖాస్తుల గడువు ఈరోజు రాత్రితో ముగియనుంది. రాత్రి 7గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌కు, 12 గంటల్లోపు దరఖాస్తు రుసుం చెల్లించేందుకు అవకాశముంది. బ్యాంకు DDలతో నేరుగా ఎక్సైజ్ స్టేషన్లలో అప్లై చేసుకోవచ్చు. కాగా నిన్న రాత్రి 8గంటల వరకు 65,629 అప్లికేషన్స్ వచ్చాయి. ఇందులో 20 దరఖాస్తులు అమెరికా నుంచి రావడం గమనార్హం. నాన్ రిఫండబుల్ ఫీజు రూపంలో రూ.1312.58 కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది.
News October 11, 2024
పిఠాపురంపై పవన్ ఫోకస్.. ప్రత్యేక బృందాల ఏర్పాటు
AP: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. అక్కడి సమస్యలను పరిష్కరించేందుకు 21 మంది జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని 52 గ్రామాలు, రెండు మున్సిపాలిటీల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారంపై సమగ్ర నివేదిక రూపొందించాలని సూచించారు.