News April 1, 2024
వాలంటీర్లపై కీలక ఆదేశాలు

AP: ఎన్నికల నేపథ్యంలో పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించడంతో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ రంగంలోకి దిగింది. వాలంటీర్లకు ప్రభుత్వం అందించిన సెల్ ఫోన్లు, సిమ్‌లు, ట్యాబ్‌లు వంటివి వెంటనే స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు సచివాలయాల శాఖ స్పష్టం చేసింది. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు వారి పరిధిలోని వాలంటీర్ల వద్ద పరికరాలను స్వాధీనం చేసుకునేలా చూడాలని కలెక్టర్లకు సూచించింది.
Similar News
News March 15, 2026
BREAKING: మొయినాబాద్‌లో కాల్పుల కలకలం

TG: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో ఈగల్ టీమ్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఫైరింగ్ చేసినట్లు తెలుస్తోంది. తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరిపారని సమాచారం. ఈ పార్టీలో కొందరు రాజకీయ నేతలు పాల్గొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పలువురిని అరెస్టు చేసి, డ్రగ్స్ సీజ్ చేశారని తెలుస్తోంది.
News March 15, 2026
జనగణన వివరాలు చెప్పకుంటే రూ.1000 ఫైన్

తెలంగాణలో మే 11 నుంచి జూన్ 9 వరకు తొలిదశ జనగణన జరగనుందని సెన్సస్ డైరెక్టర్ భారతి హోలికేరి తెలిపారు. సర్వేలో 33 రకాల ప్రశ్నలుంటాయని, వివరాలు చెప్పకుంటే రూ.1000 ఫైన్ విధిస్తామని వెల్లడించారు. జనగణన ఆధారంగానే ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలను అమలు చేస్తాయని, ప్రజలు ఎన్యుమరేటర్లకు పూర్తిగా సహకరించి డీటెయిల్స్ ఇవ్వాలని కోరారు. రెండో దశ సెన్సస్ 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు కొనసాగుతుందని చెప్పారు.
News March 15, 2026
హార్ముజ్‌కు యుద్ధ నౌకలు పంపండి: ట్రంప్

హార్ముజ్ జలసంధిపై పట్టు సాధించేందుకు US అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇరాన్ వల్ల ఇబ్బందులు పడుతున్న దేశాలు అమెరికాతో కలిసి యుద్ధ నౌకలను హార్ముజ్‌కు పంపాలని తాజాగా కోరారు. చైనా, ఫ్రాన్స్, జపాన్, ద.కొరియా, UK తదితర దేశాలు ప్రభావితమయ్యాయని, అవి తమ వార్‌షిప్స్‌ను పంపిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా వందలాది సరకు రవాణా నౌకలు హార్ముజ్‌లో నిలిచిపోవడంతో ప్రపంచం అతలాకుతలం అవుతోంది.


