News April 11, 2024
కీలక ఆదేశాలు.. ఒకటో తరగతిలో చేరేందుకు కనీస వయసు ఆరేళ్లు

యూపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకటో తరగతిలో చేరేందుకు కనీస వయసు ఆరేళ్లుగా నిర్ధారిస్తూ అన్ని స్కూళ్లకు ఆదేశాలు ఇచ్చింది. 2024 ఏప్రిల్ 1 వరకు ఆరేళ్లు నిండినవారిని అర్హులుగా పరిగణించాలని పేర్కొంది. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆరేళ్ల కన్నా తక్కువ వయసు గల పిల్లలు కిండర్గార్టెన్(ప్రీ స్కూల్)లో చేరాలని సూచించింది.
Similar News
News December 15, 2025
ఉద్యోగి రాజీనామా చేస్తే పెన్షన్కు అనర్హుడు: SC

ఉద్యోగి రాజీనామా చేస్తే అతని గత సర్వీసు రద్దవుతుందని, అలాంటి వారు ఫ్యామిలీ పెన్షన్కు అనర్హులని SC పేర్కొంది. ఉద్యోగి చేసిన రాజీనామాను ఆమోదించిన DTC PF మాత్రమే వస్తుందని, పెన్షన్ రాదని చెప్పింది. దీనిపై అతడు దావా వేయగా SC తాజా తీర్పు ఇచ్చింది. ‘VRకి పెన్షన్ వర్తిస్తుందన్నరూల్ ఉన్నా దానికి రిజైన్కీ తేడా ఉంది. రిజైన్తో పెన్షన్ రాదు’ అని పేర్కొంది. ఉద్యోగులకు ఈ తీర్పొక హెచ్చరికగా పలువురి సూచన.
News December 15, 2025
విద్యార్థులకు వేడి ఆహారమే ఇవ్వాలి: మంత్రి

AP: చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బీసీ హాస్టళ్లలోని విద్యార్థులకు తాజా, వేడి ఆహారం మాత్రమే అందించాలని బీసీ సంక్షేమ మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే ఇవ్వాలని, గదుల్లో దోమలు చొరబడకుండా తెరలు వాడాలని సూచించారు. వార్డెన్లు హాస్టల్లో భోజనాన్ని ముందుగా రుచి చూడాలని, ఆ తరువాత విద్యార్థులందరితో కలిసి భోజనం చేయాలని ఉన్నతాధికారుల సమీక్షలో తెలిపారు.
News December 15, 2025
ముగిసిన తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం

TG: రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇప్పటికే 394 పంచాయతీలు, 7,916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఎల్లుండి(DEC 17) 182 మండలాల్లో మిగిలిన 3,752 పంచాయతీలు, 28,406 వార్డులకు పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. 11 గ్రామాలు, 112 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. తొలి రెండు విడతల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక స్థానాలు గెలిచిన సంగతి తెలిసిందే.


