News November 29, 2024

మహారాష్ట్రలో కీలక సమావేశం రద్దు

image

మహారాష్ట్ర CM ఎవరో తేల్చే కీలక సమావేశం రద్దైంది. నిన్న ఢిల్లీ వెళ్లిన ‘మహాయుతి’ నేతలు BJP అధిష్ఠానాన్ని కలిసినా స్పష్టత రాలేదు. ఇవాళ ముంబైలో సమావేశం నిర్వహించి CM ఎవరో ఫైనల్ చేస్తామని శిండే ప్రకటించారు. కాగా, ఆయన ఢిల్లీ నుంచి ముంబైకి రాగానే స్వగ్రామం సతారా జిల్లాలోని దారే బయల్దేరారు. దీంతో శివసేన పార్టీ సమావేశం కూడా వాయిదా పడింది. ఆయన ముంబై తిరిగొచ్చిన తర్వాతే ఆదివారం సమావేశాలు ఉంటాయని సమాచారం.

Similar News

News December 4, 2024

సూర్యవంశీ విధ్వంసం.. సెమీస్ చేరిన భారత్

image

అండర్-19 ఆసియాకప్‌లో భారత జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. యూఏఈతో జరిగిన మ్యాచులో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన UAE 137 పరుగులకు ఆలౌటైంది. చేధనలో ఓపెనర్లు ఆయుశ్(67), వైభవ్ సూర్యవంశీ(76) రెచ్చిపోవడంతో 16.1 ఓవర్లలోనే విజయం సొంతమైంది. కాగా 13 ఏళ్ల సూర్యవంశీ IPLలో రూ.కోటికి పైగా ధర పలికిన సంగతి తెలిసిందే.

News December 4, 2024

మెగా హీరోకు అల్లు అర్జున్ థాంక్స్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే

image

మరి కొన్ని గంటల్లో ‘పుష్ప-2’ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్‌తో సహా చిత్ర బృందానికి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ <<14786860>>విష్<<>> చేశారు. దీనికి అల్లు అర్జున్ బదులిస్తూ ధన్యవాదాలు తెలిపారు. మీరంతా సినిమాను ఇష్టపడతారని ఆకాంక్షిస్తున్నట్లు రాసుకొచ్చారు. అయితే అక్కడ ‘మీరంతా’ అని ఎవరిని ఉద్దేశించి అన్నారని ఐకాన్ స్టార్‌ను మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

News December 4, 2024

PHOTO: ఒక్కటైన నాగచైతన్య-శోభిత

image

అక్కినేని నాగచైతన్య-శోభిత దూళిపాళ వివాహం ఆడంబరంగా జరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో ANR విగ్రహం ముందు ఈ జంట ఒక్కటయ్యారు. పెళ్లి వేడుకల్లో వధూవరుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా ఈ జంట రేపు లేదా ఎల్లుండి శ్రీశైలం/తిరుమలకు వెళ్లనున్నారు.