News August 2, 2024
తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక
AP: తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ ముఖ్య విజ్ఞప్తి చేసింది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు తమకు నిర్దేశించిన సమయంలో మాత్రమే క్యూ లైన్లలోకి రావాలని సూచించింది. కేటాయించిన సమయం కంటే ముందుగా వచ్చిన వారిని క్యూ లైన్లలోకి అనుమతించరని తెలిపింది. భక్తులు గమనించి సహకరించాలని కోరింది.
Similar News
News September 16, 2024
యుద్ధాన్ని కొనసాగించేందుకు మాకు వనరులున్నాయి: హమాస్
ఇజ్రాయెల్‌తో యుద్ధం విషయంలో తమకు భయం లేదని హమాస్ తాజాగా స్పష్టం చేసింది. యుద్ధం కొనసాగించేందుకు అవసరమైన వనరులన్నీ తమకున్నాయని ధీమా వ్యక్తం చేసింది. ‘ఎన్నో త్యాగాలు జరిగాయి. ఎంతోమంది అమరులయ్యారు. కానీ వాటికి ఫలితంగా విలువైన యుద్ధ అనుభవాన్ని సంపాదించుకున్నాం. వాస్తవంగా ఇంతటి భారీ యుద్ధంలో వాటిల్లే స్థాయి మరణాలు మావైపు సంభవించలేదు’ అని సమర్థించుకొంది.
News September 16, 2024
పరువు కోసం చనిపోవడానికి సిద్ధం: నటి హేమ
డ్రగ్స్ రిపోర్టులో తనకు పాజిటివ్ వచ్చిందని వార్తలు ప్రసారం చేయడంపై నటి హేమ మండిపడ్డారు. ‘ఇంకా ఛార్జ్‌షీటు నేనే చూడలేదు. మీడియాకు ఎలా వచ్చింది? ఈ వార్తలు చూసి నా తల్లి అనారోగ్యానికి గురైంది. నేనే మీడియా పెద్దల వద్దకు వస్తా. వారే టెస్టులు చేయించండి. డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే ఎంతటి శిక్షకైనా సిద్ధం. నెగటివ్ వస్తే నాకు న్యాయం చేయాలి. పరువు కోసం చనిపోవడానికి సిద్ధం’ అని ఆమె స్పష్టం చేశారు.
News September 16, 2024
రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పేంటి?: మంత్రి కోమటిరెడ్డి
TG: సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పేంటని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గత పదేళ్లలో BRS ప్రభుత్వం ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ‘రాజీవ్ గాంధీపై మాట్లాడే అర్హత KTRకు లేదు. పదేళ్లు మాదే అధికారం. వాళ్లు ఒకటి అంటే మేం రెండు అంటాం. పరుష భాష నేర్పింది కేసీఆరే. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరో BRS నేతలు చెప్పాలి’ అని మీడియాతో వ్యాఖ్యానించారు.