News June 13, 2024
DEC 31 కల్లా టీచర్ పోస్టుల భర్తీకి ఆదేశాలు
మెగా డీఎస్సీలో భాగంగా ప్రకటించిన 16,347 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. డిసెంబర్ 31 నాటికల్లా టీచర్ పోస్టులు భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను సీఎస్ ఆదేశించారు. కాగా ఈరోజు సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు మెగా డీఎస్సీపై సంతకం చేసిన విషయం తెలిసిందే.
Similar News
News September 14, 2024
ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఉప్పు వదిలేయాలా?
ఉప్పు నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటుందని కొందరి విశ్వాసం. అందుకే దీంతో దిష్టి తీస్తారు. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఉప్పును వదిలేసి వెళితే మనలోని నెగటివ్ ఎనర్జీ పోతుందనీ నమ్ముతుంటారు. అయితే అలా చేయడం సరి కాదని పండితులు చెబుతున్నారు. ఉండటానికి నీడనిచ్చిన వారి ఇంట్లో ఉప్పు వదిలేసి వారికి హాని చేసే ఆలోచన మంచిది కాదంటున్నారు. కావాలంటే ఉప్పును నీళ్లలో వేయాలంటున్నారు. కరిగాక ఎక్కడైనా పోయవచ్చని చెబుతున్నారు.
News September 14, 2024
ముగిసిన వైసీపీ నేతల విచారణ
AP: మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతల విచారణ ముగిసింది. జోగి రమేశ్, దేవినేని అవినాశ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాంను మంగళగిరి పోలీసులు విచారించారు. కాసేపటి క్రితం వారు పీఎస్ నుంచి వెళ్లిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమ పాస్‌పోర్టులను పోలీసులకు అప్పగించారు.
News September 14, 2024
ఖైరతాబాద్ గణేశ్.. నిమజ్జనం ఎన్ని గంటలకంటే?
TG: ఈ నెల 17న హైదరాబాద్‌లో నిమజ్జన కార్యక్రమం జరగనుంది. దీని కోసం సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 30వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు HYD కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనాన్ని మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలలోపు పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఉదయం 6 గంటలకు గణనాథుడికి పూజలు పూర్తి చేసి నిమజ్జనానికి తరలివెళ్లనున్నట్లు చెప్పారు.