News October 13, 2024
మద్యంపై అదనపు ప్రివిలేజ్ ఫీజు విధింపు
AP: భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యం ధరకు సంబంధించి అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఫీజు కింద MRPలో చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు రౌండాఫ్ చేసింది. MRP ₹160.50గా ఉంటే దాన్ని ₹170కి పెంచేలా ఫీజు ఉంటుంది. ప్రభుత్వం క్వార్టర్ బాటిల్ ధర ₹99కే నిర్ధారించడంతో రూ.100లో రూ.1 మినహాయించి విక్రయిస్తారని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.
Similar News
News November 12, 2024
ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు వీరికే..
ICC మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్(OCT)గా పాక్ స్పిన్నర్ నోమన్ అలీ, ఉమెన్స్ విభాగంలో అమేలియా కెర్(కివీస్) ఎంపికయ్యారు. ENGతో టెస్టు సిరీస్‌లో నోమన్ 13.85 యావరేజ్‌తో 20 వికెట్లు పడగొట్టారు. దీంతో రబడ, శాంట్నర్‌ను అధిగమించి అవార్డు పొందారు. అమేలియా ఉమెన్స్ T20 వరల్డ్ కప్‌తో సహా అక్టోబర్‌లో 19 వికెట్లు కూల్చి, 160 రన్స్ చేశారు. డియాండ్రా డాటిన్, లారా వోల్వార్డ్‌తో పోటీ పడి అవార్డు గెలుచుకున్నారు.
News November 12, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసు.. BRS మాజీ MLAలకు నోటీసులు
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతంగా సాగుతోంది. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన నలుగురు BRS మాజీ ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ద్వారా వీరిపై చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
News November 12, 2024
వికారాబాద్ బయల్దేరిన BRS నేతలు
TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో అరెస్టైన రైతులను పరామర్శించేందుకు BRS నేతలు కొడంగల్ నియోజకవర్గానికి బయల్దేరారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి నేతృత్వంలోని ఆ పార్టీ నేతలు అరెస్టైన వారికి సంఘీభావం తెలపనున్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు వంద మంది దాడిలో పాల్గొన్నట్లు గుర్తించారు. ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.