News August 11, 2024

కాసేపట్లో భూమి సమీపానికి గ్రహ శకలం

image

ఈరోజు రాత్రి 12గంటల సమయంలో ‘2024 పీకే2’ అనే గ్రహశకలం భూమి సమీపానికి రానుందని నాసా తెలిపింది. గంటకు 31,380 కిలోమీటర్ల వేగంతో అది ప్రయాణిస్తోందని పేర్కొంది. 83 అడుగుల పొడవుతో సుమారు ఓ చిన్న భవనమంతటి సైజులో ఉండే ఆ శకలం, భూమికి 12 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుందని వివరించింది. తరచూ భూ కక్ష్యలోకి వచ్చే ఆస్టరాయిడ్స్‌ని అటెన్ గ్రూప్‌గా పిలుస్తున్నారు. ఇది ఆ గ్రూప్‌నకే చెందినదిగా నాసా తెలిపింది.

Similar News

News July 9, 2025

మేడిగడ్డ కూలిపోవాలనే గాలికొదిలేశారా?: బీఆర్ఎస్

image

TG: కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపిందని BRS ఆరోపించింది. ‘మేడిగడ్డపై సెక్యూరిటీని తొలగించడంతో బ్యారేజీపైన వాహనాలు యథేచ్చగా తిరుగుతున్నాయి. భారీ వాహనాల వల్ల పిల్లర్లపై ఒత్తిడి పడి కొట్టుకుపోవాలనేదే కాంగ్రెస్ కుట్ర. దీనిని పనికిరాని ప్రాజెక్టుగా చూపించి KCRను దోషిగా నిలబెట్టాలని చూస్తోంది. ఏపీ ప్రయోజనాలకు గోదావరి నీటిని బహుమతిగా ఇవ్వాలనే రెండో ప్లాన్ ఉంది’ అని రాసుకొచ్చింది.

News July 9, 2025

తిరుమలలో మొదట ఎవరిని దర్శించుకోవాలంటే?

image

తిరుమల కొండపైకి చేరుకోగానే చాలా మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం క్యూ కడుతుంటారు. నిజానికి తిరుమల ఆదివరాహ క్షేత్రం. అందువల్ల తిరుమలకు వచ్చే భక్తులు తొలుత పుష్కరిణి పక్కనే ఉన్న వరాహ క్షేత్రాన్ని దర్శించుకోవాలనే ఆచారం ఉంది. ఈ విషయాన్ని ‘TTD అప్డేట్స్’ X వేదికగా పేర్కొంటూ భక్తులకు అవగాహన కల్పిస్తోంది. వెంకటేశ్వర స్వామి వాగ్దానం ప్రకారం.. వరాహ స్వామికి మొదటి పూజ, నైవేద్యం సమర్పిస్తారని ప్రతీతి.

News July 9, 2025

లార్డ్స్‌లో పరుగుల వరద కష్టమే?

image

టీమ్ఇండియా పరుగుల వరదకు అడ్డుకట్ట వేసేందుకు లార్డ్స్‌లో ‘గ్రాస్ టాప్ పిచ్’ రెడీ చేసినట్లు తెలుస్తోంది. పిచ్ మీద గ్రాస్ ఎక్కువుంటే బ్యాటింగ్ కష్టమవుతుంది. ముఖ్యంగా పేసర్లకు పిచ్ సహకరించే అవకాశం ఎక్కువ. మూడో టెస్టులో ఇంగ్లండ్‌ బౌలర్లు ఆర్చర్, అట్కిన్‌సన్ ఉండే అవకాశాలున్నాయి. వారికి ఈ పిచ్ అనుకూలంగా ఉండొచ్చు. అయితే, ఆకాశ్ దీప్ ఫామ్‌లో ఉండటం, బుమ్రా కంబ్యాక్ టీమ్ఇండియాకి కూడా కలిసొచ్చే ఛాన్సుంది.