News November 25, 2024

కాసేప‌ట్లో మ‌హారాష్ట్ర ఉత్కంఠ‌కు తెర‌

image

మ‌హారాష్ట్ర తదుప‌రి CM ఎవ‌ర‌న్న‌ది మ‌రికొన్ని గంట‌ల్లో తేల‌నుంది. బీజేపీ అధిష్ఠానం త‌న క‌స‌ర‌త్తును ఓ కొలిక్కి తెచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ విషయ‌మై చ‌ర్చించేందుకు మ‌హాయుతి కూట‌మి నేత‌లు దేవేంద్ర ఫ‌డ‌ణ‌వీస్‌, ఏక్‌నాథ్ శిండే, అజిత్ ప‌వార్ ఢిల్లీ చేరుకున్నారు. రాత్రి 10.30 గంట‌ల‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో వీరు స‌మావేశం కానున్నారు. సీఎం ప‌ద‌వి స‌హా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై చ‌ర్చించ‌నున్నారు.

Similar News

News December 4, 2024

అస్సాంలో బీఫ్ తినడంపై బ్యాన్

image

అస్సాంలో బీఫ్ (గొడ్డు మాంసం)పై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. రెస్టారెంట్లు, ఫంక్షన్లు, బహిరంగ ప్రదేశాల్లో అన్ని మతాల వారు బీఫ్ తినడాన్ని బ్యాన్ చేస్తున్నామన్నారు. ఇది వరకు ఆలయాల దగ్గర ఈ నిషేధం విధించామని, ఇప్పుడా నిర్ణయం రాష్ట్రం మొత్తం వర్తిస్తుందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతించాలని లేదంటే పాకిస్థాన్ వెళ్లిపోవాలని మంత్రి పిజుష్ ట్వీట్ చేశారు.

News December 4, 2024

అత్యంత చెత్త ఎయిర్‌లైన్స్‌లో భారత సంస్థ!

image

ప్రపంచ ఎయిర్‌లైన్స్‌లో ఈ ఏడాది అత్యుత్తమైనవి, చెత్తవాటితో కూడిన జాబితాను ఎయిర్‌హెల్ప్ సంస్థ రూపొందించింది. సమయపాలన, ప్రయాణికుల సంతృప్తి తదితర అంశాల ఆధారంగా ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. అత్యంత చెత్త ఎయిర్‌లైన్‌గా 109వ స్థానంలో టునీస్‌ఎయిర్ నిలవగా 103వ స్థానంలో భారత ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగో ఉంది. అత్యుత్తమ ఎయిర్‌లైన్‌గా బ్రస్సెల్స్ ఎయిర్‌లైన్స్, ఖతర్ ఎయిర్‌వేస్ తొలి 2 స్థానాలు దక్కించుకున్నాయి.

News December 4, 2024

KCRకు రేవంత్ రెడ్డి సవాల్

image

KCR రూ.1.02 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని సీఎం రేవంత్ విమర్శించారు. ‘మేం కట్టిన శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు 60 ఏళ్లు ఎలా ఉన్నాయో, నువ్వు కట్టిన కాళేశ్వరం ఎలా ఉందో చూడ్డానికి రా. లెక్కలు తేలుద్దాం’ అని సవాల్ విసిరారు. కాళేశ్వరం నుంచి చుక్కనీళ్లు లేకపోయినా రికార్డు స్థాయిలో కోటి మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని సీఎం తెలిపారు.