News October 22, 2024
‘INDIA’లో కాంగ్రెస్ మాట చెల్లడం లేదా!
హరియాణా, JK ఫలితాలతో కాంగ్రెస్ పెద్దరికానికి పెనుముప్పు ఏర్పడింది! మహారాష్ట్ర, ఝార్ఖండ్, UPలో మిత్రపక్షాలు దాని మాటే వినడం లేదని తెలుస్తోంది. మహాలో శివసేన UBT కాంప్రమైజ్ కావడమే లేదు. PCC చీఫ్ నానా పటోలేను లెక్కచేయడమే లేదు. JHAలో సీట్లు తక్కువిస్తే సొంతంగా పోటీచేస్తామని RJD బెదిరిస్తోంది. కూటమి పోటీ లెక్క తేలలేదు. UP ఉప ఎన్నికల్లో SP అసలు INCని పట్టించుకోవడమే లేదన్న వార్తలపై మీ అభిప్రాయం ఏంటి?
Similar News
News November 10, 2024
ఇజ్రాయెల్ దాడుల్లో 40 మంది మృతి
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 40 మంది లెబనాన్ పౌరులు మరణించినట్లు ఆ దేశ అధికారులు ప్రకటించారు. మృతుల్లో చిన్నారులే అధికంగా ఉన్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 20కిపైగా దాడులు జరిగినట్లు వెల్లడించారు. అలాగే ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 3,136 మంది ప్రాణాలు కోల్పోగా, 13,979 మంది గాయాలపాలయ్యారని పేర్కొన్నారు. మృతుల్లో 619 మంది మహిళలు, 194 మంది చిన్నారులు ఉన్నట్లు తెలిపారు.
News November 10, 2024
సజ్జల భార్గవ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
AP: వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి సజ్జల భార్గవ రెడ్డిపై పులివెందులలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. సింహాద్రిపురం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవ్‌తో పాటు వర్రా రవీందర్ రెడ్డి, అర్జున్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ప్రశ్నించడంతో తనను కులం పేరుతో దూషించారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. కాగా ఇప్పటికే ఓ కేసులో వర్రా కోసం పోలీసులు గాలిస్తున్నారు.
News November 10, 2024
సీఎంవోను ముట్టడిస్తాం: వాలంటీర్ల హెచ్చరిక
AP: ఎన్నికల హామీ మేరకు తమను కొనసాగించడంతోపాటు రూ.10వేలకు జీతం పెంచాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. హామీ నెరవేర్చకపోతే అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని సీపీఐ అనుబంధ AIYF హెచ్చరించింది. ప్రభుత్వ వ్యవస్థలో వాలంటీర్లు లేరని పవన్ కళ్యాణ్ చెప్పడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ విషయంపై త్వరలో సీఎం చంద్రబాబును కలవనున్నట్లు తెలిపారు.