News November 7, 2024

భార్యాభర్తల బంధం స్ట్రాంగ్‌గా ఉండాలంటే.. సైంటిస్టుల సూచన

image

అన్యోన్యమైన దాంపత్యానికి సూచనలు అంటే ఏం చెబుతారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ప్రేమ, గౌరవం చూపించడం. అయితే తమ పార్ట్‌నర్‌ను ఆటపట్టించడం కూడా ఆరోగ్యకరమైన బంధంలో భాగమేనని కాన్సాస్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. 15వేల మందిపై అధ్యయనం చేసి, దంపతుల మధ్య జరిగే ఫన్నీ మూమెంట్స్ బంధాన్ని బలపరుస్తాయని తేల్చారు. అయితే హాస్యమేదైనా భాగస్వామిని తీవ్రంగా ఎగతాళి చేసే స్థాయికి వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు.

Similar News

News November 8, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* AP: సోషల్ మీడియాలో హద్దులు మీరితే వదిలే ప్రసక్తి లేదు: CBN
* వాలంటీర్లు వ్యవస్థలోనే లేరు: పవన్
* వైసీపీ పాలనలో వెంటిలేటర్‌పై ఏపీ: అనిత
* కూటమి పాలనలో రాష్ట్రానికి చీకటి రోజులు: జగన్
* నేను YSRకు పుట్టలేదని అవమానించారు: షర్మిల
* TG: నేను ఎవ్వరి కాళ్లు పట్టుకోను: మంత్రి పొంగులేటి
* బీఆర్ఎస్, కాంగ్రెస్‌ను ఖతం చేస్తాం: కిషన్‌రెడ్డి
* జైలుకు పంపితే యోగా చేసుకుంటా: KTR

News November 8, 2024

విలేజ్ డిఫెన్స్ గార్డుల‌ను హతమార్చిన ఉగ్రవాదులు

image

J&K కిష్త్వార్‌లోని ఓహ్లీ కుంట్వారాకు చెందిన ఇద్ద‌రు విలేజ్ డిఫెన్స్ గార్డుల‌ను (VDG) జైష్-ఏ-మహ్మద్‌కు చెందిన కశ్మీర్ టైగర్స్ ఉగ్ర‌వాదులు కాల్చిచంపారు. దీనిపై ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన‌ కశ్మీర్ టైగర్స్ VDG క్రియాశీల‌క సభ్యులు కుల్దీప్ కుమార్, నజీర్ అహ్మద్ గురువారం ఉదయం ఆక్రమిత కశ్మీర్‌లోని అట‌వీ ప్రాంతంలో ఇస్లాం ముజాహిదీన్‌లను వెంబడిస్తూ వ‌చ్చిన‌ట్టు తెలిపింది. దీంతో కాల్చిచంపిన‌ట్టు ప్రకటించింది.

News November 8, 2024

నిరుపేదల సేవలో సచిన్ భార్య, కుమార్తె

image

సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్‌ సేవా కార్యక్రమాల్లో భాగంగా సచిన్ భార్య అంజలి, కుమార్తె సారా రాజస్థాన్‌లో నిరుపేదలతో సమయాన్ని గడిపారు. పోషణ అందని చిన్నారులకు ఆహారాన్ని అందించడంతో పాటు కలిసి ఆడుకున్నారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాలో సారా వెల్లడించారు. అన్ని కష్టాల్లోనూ అక్కడి మహిళలు చూపిస్తున్న సంకల్ప బలం తనకు స్ఫూర్తినిచ్చిందని ఆమె వెల్లడించారు.