News November 7, 2024

భార్యాభర్తల బంధం స్ట్రాంగ్‌గా ఉండాలంటే.. సైంటిస్టుల సూచన

image

అన్యోన్యమైన దాంపత్యానికి సూచనలు అంటే ఏం చెబుతారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ప్రేమ, గౌరవం చూపించడం. అయితే తమ పార్ట్‌నర్‌ను ఆటపట్టించడం కూడా ఆరోగ్యకరమైన బంధంలో భాగమేనని కాన్సాస్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. 15వేల మందిపై అధ్యయనం చేసి, దంపతుల మధ్య జరిగే ఫన్నీ మూమెంట్స్ బంధాన్ని బలపరుస్తాయని తేల్చారు. అయితే హాస్యమేదైనా భాగస్వామిని తీవ్రంగా ఎగతాళి చేసే స్థాయికి వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు.

Similar News

News November 12, 2025

CCS సమావేశం ప్రారంభం.. ఏం జరగబోతోంది?

image

ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశం ప్రారంభమైంది. ఇందులో కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, సీతారామన్, జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పాల్గొన్నారు. ఈ భేటీలో ఉగ్రవాదుల ఏరివేతపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దేశంలో మేజర్ సెక్యూరిటీ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే CCS భేటీ అవుతుంది.

News November 12, 2025

ప్రభుత్వ వైఫల్యం వల్లే పేలుడు: ఖర్గే

image

ప్రభుత్వ వైఫల్యం వల్లే ఢిల్లీ బ్లాస్ట్‌ జరిగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ‘దేశ రాజధానిలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. IB, CBI లాంటి ఏజెన్సీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం విఫలమైంది. దర్యాప్తు నివేదిక వచ్చాక మేం మరింత మాట్లాడతాం’ అని తెలిపారు.

News November 12, 2025

5 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు

image

ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత దేశంలోని 5 విమానాశ్రయాలకు తాజాగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. HYD, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేండ్రం ఎయిర్‌పోర్టులు పేల్చేస్తామని దుండగుల నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్ కార్యాలయానికి మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ HYD సహా మిగతా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. బస్టాప్స్, టెంపుల్స్, షాపింగ్ మాల్స్‌లోనూ సోదాలు నిర్వహిస్తోంది.