News October 12, 2024
ఆ విషయంలో భాగస్వామి వద్దకు కాకపోతే ఇంకెవరి వద్దకు వెళ్తారు: హైకోర్టు
నైతిక నాగరిక సమాజంలో ఒక వ్యక్తి (M/F) శారీరక, లైంగిక కోరికలను తీర్చుకోవడానికి భాగస్వామి వద్దకు కాకుండా ఇంకెవరి దగ్గరకు వెళ్తారని అలహాబాద్ హైకోర్టు ప్రశ్నించింది. భర్తపై పెట్టిన వరకట్నం కేసులో భార్య ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ కేసు కొట్టేసింది. ఈ కేసు ఇద్దరి మధ్య లైంగిక సంబంధ అంశాల్లో అసమ్మతి చుట్టూ కేంద్రీకృతమైనట్టు పేర్కొంది.
Similar News
News November 6, 2024
ట్రంప్ గెలుపు: రష్యాకు కాదు ఉక్రెయిన్‌కే షాక్
డొనాల్డ్ ట్రంప్ విజయం ఉక్రెయిన్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాను యుద్ధాలు చేసేందుకు కాదు ఆపేందుకు వచ్చానని గెలుపు స్పీచ్‌లోనే ట్రంప్ స్పష్టం చేశారు. పైగా నాటోపై ఖర్చుచేయడం దండగని గతంలో చాలాసార్లు చెప్పారు. రష్యాతో యుద్ధం మొదలయ్యాక మిలిటరీ సాయం కింద ఉక్రెయిన్‌కు అమెరికా $64 బిలియన్లు సాయం చేసింది. ఇకపై దీనిని ఆపేయొచ్చు. మునుపటి స్థాయిలో నైతిక మద్దతు ఇవ్వకపోవచ్చు.
News November 6, 2024
RCBకే మళ్లీ ఆడతానేమో: మ్యాక్స్‌వెల్
రిటెన్షన్ల ప్రక్రియ చేపట్టేముందు RCB తనను సంప్రదించిందని ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తెలిపారు. రిటైన్ చేసుకోవటం లేదని, తమను అర్థం చేసుకోవాలని కోరినట్లు చెప్పారు. ‘అరగంటపాటు నాతో ఆండీ ఫ్లవర్, మో బోబాట్ జూమ్ కాల్‌లో మాట్లాడారు. రిటైన్ చేసుకోకపోవడానికి కారణం చెప్పారు. అదో గొప్ప ఫ్రాంచైజీ. మళ్లీ ఆ జట్టులోకి వెళ్తానేమో. RCBతో నా ప్రయాణం ముగిసిందని చెప్పలేను’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
News November 6, 2024
3ఏళ్లలో అందుబాటులోకి మామునూర్ ఎయిర్‌పోర్టు: కోమటిరెడ్డి
TG: వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్టును 3ఏళ్లలో అందుబాటులోకి తేవాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులను ఆదేశించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణపనులు ఉండాలని సూచించారు. ఈమేరకు సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి 15రోజులకోసారి పనుల తీరుపై తాను సమీక్షిస్తానని చెప్పారు. ఎయిర్‌పోర్టును ఉడాన్ స్కీమ్‌తో అనుసంధానం చేసి పెద్ద పట్టణాలతో రాకపోకలకు అనువుగా మార్చాలన్నారు.