News April 20, 2024

రాయి దాడిపై అనుచిత వ్యాఖ్యలు.. టీడీపీకి సీఈవో నోటీసులు

image

AP: సీఎం జగన్‌పై రాయి దాడి తర్వాత సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ జనరల్ సెక్రటరీకి సీఈవో నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. లేదంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. జై టీడీపీ, తెలుగు దేశం పార్టీ అకౌంట్ల నుంచి జగన్‌పై అనుచిత పోస్టులు చేశారని సీఈవోకు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించారు.

Similar News

News April 3, 2026

1,000 ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

image

పంజాబ్&సింధ్ బ్యాంకులో 1,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. TGలో 30 పోస్టులున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణత, ఏదైనా బ్యాంకులో 18 నెలల పని అనుభవం ఉన్న వారు అర్హులు. అప్లై చేసిన వారికి సంబంధిత రాష్ట్రంలోని లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. 20-30 ఏళ్ల వయసుండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ APR 20.
వెబ్‌సైట్: https://punjabandsind.bank.in/

News April 3, 2026

ఈనెల 29న హీరో బెల్లంకొండ శ్రీనివాస్ వివాహం?

image

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యా రెడ్డి <<19338854>>వివాహ<<>> ముహూర్తం ఖరారైనట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈనెల 5న ఓ ఫామ్‌హౌస్‌లో కుటుంబీకులు, సెలబ్రిటీల సమక్షంలో నిశ్చితార్థ వేడుక జరగనున్నట్లు పేర్కొన్నాయి. అలాగే ఏప్రిల్ 29న తిరుమలలో వీరి వివాహం జరగనున్నట్లు చెప్పాయి. దీనిపై త్వరలోనే బెల్లంకొండ కుటుంబం అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.

News April 3, 2026

ప్రసవం తర్వాత డిప్రెషన్‌లోకి తండ్రులు: అధ్యయనం

image

బిడ్డ పుట్టిన తర్వాత తండ్రులకూ డిప్రెషన్ వచ్చే అవకాశం ఉందని JAMA నెట్‌వర్క్ ఓపెన్‌లో ప్రచురించిన కొత్త అధ్యయనంలో వెల్లడైంది. సుమారు 30%మంది తండ్రులు ఈ మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. నిద్రలేమి, పెరిగిన బాధ్యతలు, ఆర్థిక ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణాలు. తండ్రి డిప్రెషన్‌లో ఉంటే అది తల్లి ఆరోగ్యం, బిడ్డ ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.