News February 20, 2025

కుంభమేళాలో మహిళల వీడియోల ఘటన.. కేసు నమోదు

image

మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేస్తున్న మహిళల వీడియోలు, ఫొటోలు తీసి SMలో పోస్ట్ చేస్తున్న ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. రెండు సోషల్ మీడియా అకౌంట్లపై కొత్వాలి కుంభమేళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఆ ఖాతాలను నడుపుతున్న వారి వివరాలు తెలపాలంటూ మెటాను కోరారు. అలాగే టెలిగ్రామ్‌లో ఆ వీడియోలను విక్రయిస్తున్నవారిపైనా మరో కేసు నమోదైంది. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

Similar News

News March 23, 2025

TG సిఫారసు లేఖలపై రేపటి నుంచి శ్రీవారి దర్శనం

image

TG ప్రజాప్రతినిధుల <<15790945>>సిఫారసు లేఖలపై<<>> తిరుమల శ్రీవారి దర్శనం రేపటి నుంచి అమలు కానుంది. సోమ, మంగళవారాల్లో VIP బ్రేక్, బుధ, గురువారాల్లో ₹300 స్పెషల్ దర్శనాలు ఉంటాయి. AP సిఫారసు లేఖలపై MONకి బదులు ఆదివారం దర్శనాలకు అనుమతిస్తారు. కాగా ఈనెల 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 30న ఉగాది నేపథ్యంలో ఈ రెండు రోజుల్లో VIP బ్రేక్ దర్శనాలను TTD రద్దు చేసింది. 24, 29 తేదీల్లో సిఫారసు లేఖలు తీసుకోబోమని తెలిపింది.

News March 23, 2025

అట్లీ సినిమాలో బన్నీ డ్యుయల్ రోల్?

image

తమిళ డైరెక్టర్ అట్లీతో చేయబోయే సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒక క్యారెక్టర్‌లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని, సినిమాలో మెయిన్ విలన్ పాత్ర అదేనని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ‘పుష్ప’ సినిమాలోని పుష్పరాజ్ పాత్రలోనూ కొంతవరకు నెగటివ్ షేడ్స్ ఉన్న సంగతి తెలిసిందే.

News March 23, 2025

కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

image

టీ20 ఫార్మాట్‌లో 400 మ్యాచులు ఆడిన మూడో భారత ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించారు. KKRతో జరిగిన మ్యాచుతో ఈ ఘనత అందుకున్నారు. అతనికంటే ముందు రోహిత్ శర్మ(448), దినేశ్ కార్తీక్ (412) ఈ ఫీట్ సాధించారు. కాగా టీ20ల్లో అత్యధిక రన్స్ చేసిన లిస్టులో కోహ్లీ (12,945) ఐదో స్థానంలో ఉన్నారు. గేల్ (14,562), హేల్స్ (13,610), షోయబ్ (13,537), పొలార్డ్ (13,537) తొలి 4 స్థానాల్లో కొనసాగుతున్నారు.

error: Content is protected !!