News November 26, 2024

ఉపాధి హామీలో కొత్త పనులు చేర్చండి: పవన్ కళ్యాణ్

image

AP: ఉపాధి హామీ పథకంలో కొత్త పనులు చేర్చాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. ‘ఉపాధి పనుల్లో పీఎం ఆవాస్ యోజన ద్వారా ఇళ్లు కట్టుకోవడానికి 90 రోజుల పనిదినాలను 100 రోజులకు పెంచండి. ఉపాధి నిధులతో శ్మశానవాటికలు, పంచాయతీ భవనాల ప్రహరీలు, దోబీఘాట్‌లు, ఆరోగ్య కేంద్రాలు, తాగునీటి పనులకు అవకాశం కల్పిస్తే ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది’ అని పవన్ కోరారు.

Similar News

News November 26, 2024

డాక్టర్ చైనాలో.. ఆపరేషన్ మొరాకోలో!

image

చైనాకు, మొరాకోకు 12వేల కిలోమీటర్ల దూరం. కానీ చైనాలోని షాంఘైలో ఉన్న వైద్యుడు మొరాకోలో ఉన్న రోగికి రోబోటిక్ విధానంలో ప్రోస్టేట్ క్యాన్సర్ సర్జరీని ఈ నెల 16న నిర్వహించారు. ఇంత దూరం నుంచి రిమోట్ సర్జరీ చేసిన తొలి వైద్యుడిగా రికార్డుకెక్కారు. దీనికోసం టౌమాయ్ రోబోట్‌ను, అత్యాధునిక సాంకేతికతను వాడినట్లు ఆయన వెల్లడించారు. కేవలం రెండు గంటల్లోనే ఆపరేషన్ ముగిసిందని, రోగి కోలుకుంటున్నారని తెలిపారు.

News November 26, 2024

13 ఏళ్ల వైభవ్ IPLలో ఆడేందుకు అర్హుడా?

image

IPL వేలంలో 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని RR దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైభవ్ అసలు IPL ఆడేందుకు అర్హుడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. IPLలో ఆడేందుకు కనీస నిబంధనలేవీ లేవు. కానీ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాలంటే 15 ఏళ్లు ఉండాలి. అయితే ఆయా దేశాల క్రికెట్ బోర్డులు డిక్లరేషన్ సమర్పించి 15 ఏళ్లలోపు వారినీ ఆడించొచ్చు. పాక్‌కు చెందిన హసన్ రజా(14 ఏళ్ల 227 రోజులు) అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన పిన్న వయస్కుడు.

News November 26, 2024

FSO ఫలితాలు విడుదల

image

తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నియామక ఫలితాలను TGPSC విడుదల చేసింది. IPM పబ్లిక్ హెల్త్ లేబొరేటరీలు, ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో 24 పోస్టుల భర్తీకి 2022లో నోటిఫికేషన్ విడుదలైంది. 16వేల మందికి పైగా దరఖాస్తు చేయగా, ఇటీవల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తైంది. తాజాగా ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.