News November 26, 2024
ఉపాధి హామీలో కొత్త పనులు చేర్చండి: పవన్ కళ్యాణ్
AP: ఉపాధి హామీ పథకంలో కొత్త పనులు చేర్చాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. ‘ఉపాధి పనుల్లో పీఎం ఆవాస్ యోజన ద్వారా ఇళ్లు కట్టుకోవడానికి 90 రోజుల పనిదినాలను 100 రోజులకు పెంచండి. ఉపాధి నిధులతో శ్మశానవాటికలు, పంచాయతీ భవనాల ప్రహరీలు, దోబీఘాట్‌లు, ఆరోగ్య కేంద్రాలు, తాగునీటి పనులకు అవకాశం కల్పిస్తే ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది’ అని పవన్ కోరారు.
Similar News
News December 4, 2024
ప్రజల తీర్పు బాధ్యతను పెంచింది: ఫడణవీస్
మహారాష్ట్ర ఎన్నికలు చారిత్రకమని ఆ రాష్ట్ర కాబోయే CM ఫడణవీస్ అన్నారు. తనను LP నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపిన ఆయన మాట్లాడుతూ.. తాజా ఎన్నికలు ‘ఏక్ హైతో సేఫ్ హై’ అని స్పష్టం చేశాయని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నానని, వారి తీర్పు తమ బాధ్యతను పెంచిందన్నారు. హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. రేపు ముంబై ఆజాద్ మైదానంలో ఫడణవీస్ CMగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
News December 4, 2024
పార్టీ బలోపేతంపై ఫోకస్.. జగన్ కీలక సమావేశం
AP: వైసీపీ బలోపేతమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత జగన్ తాడేపల్లిలో కీలక సమావేశం నిర్వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, రీజినల్ కోఆర్డినేటర్లు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రజా పోరాటాలు, వైసీపీ బలోపేతం, కమిటీల ఏర్పాటు, ప్రభుత్వ హామీల అమలు కోసం ఆందోళనలు చేపట్టడం సహా పలు అంశాలపై జగన్ చర్చిస్తున్నారు.
News December 4, 2024
హైదరాబాద్‌లో రోశయ్య విగ్రహం: రేవంత్
TG: గతంలో CMగా ఎవరున్నా, నంబర్ 2 మాత్రం రోశయ్యదేనని రేవంత్ రెడ్డి వెల్లడించారు. HYD హైటెక్స్‌లో రోశయ్య వర్ధంతి కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. ‘సమయం వచ్చినప్పుడు ఆయనే నం.1 అయ్యారు. రోశయ్య నిబద్ధత, సమర్థత వల్లే తెలంగాణ మిగులు రాష్ట్రం ఏర్పడింది. ప్రజలకు మేలు చేసే ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అలాంటి వ్యక్తికి HYDలో విగ్రహం లేకపోవడం బాధాకరం. మేం ఏర్పాటు చేస్తాం’ అని CM చెప్పారు.